ఢిల్లీ: తాను ఎమ్మెల్యే విజయుడుపై దాడి చేసినట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఖండించారు. తాము సోదరులుగా ఉంటామని, ఇద్దరం కూడా సంక్షేమం పనులు చేయడానికి ఉన్నామన్నారు. ఎమ్మెల్యే విజయుడుపై దాడి చేసినట్లు ఎవరో కావాలని క్రియేట్ చేశారన్నారు. అల్లాపూర్‌లో కొన్ని శంకుస్థాపనలు జరిగే సమయంలో ఎమ్మెల్యే విజయుడు, తాను కలిసి కొన్నికార్యక్రమాలు నిర్వహించామన్నారు. ‘నేను, ఎమ్మెల్యే,ప్రోటోకాల్ పాటిస్తూనే కార్యక్రమాలు నిర్వహించాం.
నేను ఎమ్మెల్యే విజయుడుపై దాడి చేయలేదు, అలాంటి ఉద్దేశ్యం నాకు లేదు. మేము ఇద్దరం దళితులం. కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారు. ఎల్లుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవం ఉంది మళ్ళీ అక్కడ కలుస్తున్నాం. ఎమ్మెల్యే విజయుడు నాకు ఇంతకు ముందు ఫోన్ చేసి టీవీలో ఏమో వస్తుంది నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. కొందరు దిన్ని రాజకీయం చేస్తున్నారు. ఎమ్మెల్యే, నేను అన్నదమ్ములుగా కలిసి ఉన్నాము. ప్రజలు నన్ను గెలిపించారు నేను ఎంపీని అయ్యాను. అప్రజాస్వామ్యంగా నేను ఎప్పుడూ వ్యవహరించలేదు’అని స్పష్టం చేశారు.


