వాషింగ్టన్: దీపావళి సందర్భంగా అమెరికా పోస్టల్ విభాగం ఒక ప్రత్యేక స్టాంపును విడుదల ఏచసింది. హ్యూస్టన్‌లోని భారతీయ సంతతి కళాకారిణి సంగీతా భూతడ ముగ్గు డిజైన్‌తో కూడిన ఈ స్టాంపును అమెరికాలో బుధవారం వాషింగ్టన్‌లోని భారతీయ దౌత్య కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంగీతా భూతడతోపాటు అమెరికాలో భారతీయ దౌత్యవేత్త వినయ్ మోహన్ ఖ్వాత్రా, అమెరికా పోస్టల్ విభాగం సీనియర్ ఉపాధ్యక్షులు శిబానీ గంభీర్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమెరికా పోస్టల్ విభాగం ఒక ప్రకటన విడుదల చేస్తూ రంగోలి (ముగ్గు)లోని రంగుల వైవిధ్యాన్ని, బియ్యప్పిండి, ముగ్గురాయి, పూలరేకులతో ముగ్గులు వేస్తారన్న విషయాన్ని... దీని వెనుక ఉన్న సాంస్కృతిక నేపథ్యాన్ని వివరించింది. దీపావళి ప్రత్యేక స్టాంపు కోసం అమెరికా పోస్టల్ విభాగం తమను ఏడాది క్రితమే
సంప్రదించిందని, సుమారు డజను స్కెచ్‌ల నుంచి నాలుగింటిని వారు ఎంపిక చేశారని.. స్టాంపులో ఉన్న ముగ్గు డిజైన్‌ను సిద్ధం చేసేందుకు పది రోజుల సమయం పట్టిందని సంగీతా వివరించారు.
వీలైనంతవరకూ ప్రకాశవంతమైన రంగులు వాడమన్న సూచన మాత్రమే పోస్టల్ విభాగం నుంచి వచి్చనట్లు తెలిపారు.తాను సిద్ధం చేసిన ముగ్గు ఎనిమిది అడుగుల ఎత్తు, వ్యాసం ఉందని చెప్పారు. నీలి, నారింజ, పచ్చ రంగుతోపాటు ఎరుపు, తెలుపులను కూడా ఇందులో వాడినట్లు తెలిపారు. హ్యూస్టన్‌లో ఎంతోకాలంగా నివసిస్తున్న ఈమె ముగ్గులేయడాన్ని 30 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. ముగ్గును సంగీత సిద్ధం చేయగా స్టాంపు మొత్తాన్ని జెన్నిఫర్ ఆర్నాల్డ్ డిజైన్ చేయగా, విలియం జె గికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. దీపావళి సందర్భంగా అమెరికా పోస్టల్ విభాగం ఒక స్టాంపును విడుదల చేయడం 2016 తరువాత ఇదే మొదటిసారి.


