గాల్లో తేలే నౌకను ఎప్పుడైనా చూశారా? దీని ప్రత్యేకత ఏంటంటే? | Hovercraft How It Works Indian Coast Guard | Sakshi
Sakshi News home page

గాల్లో తేలే నౌకను ఎప్పుడైనా చూశారా? దీని ప్రత్యేకత ఏంటంటే?

Oct 31 2026 9:06 AM | Updated on Oct 31 2026 9:06 AM

Hovercraft How It Works Indian Coast Guard

కిడ్స్‌ స్పెషల్‌

వింతలు విశేషాలు

పిల్లలూ! మీరు రోడ్డు మీద వెళ్లే కార్లను చూశారు, సముద్రంలో ప్రయాణించే పడవలను చూశారు. మరి రోడ్డు మీద, ఇసుకలో, బురదలో, అలాగే నీటి మీద.. ఇలా అన్నింటిపైనా ఒకేలా దూసుకుపోయే సూపర్‌ వెహికల్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? దాని పేరే హోవర్‌ క్రాఫ్ట్‌. 

ఇటీవల మన దేశ రక్షణ దళానికి చెందిన ‘ఏ–562’ అనే సరికొత్త హోవర్‌ క్రాఫ్ట్‌ చెన్నైలోని మెరీనా బీచ్‌కు వచ్చి ఆగింది. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?

  • దీనికి కింద చక్రాలు ఉండవు. పడవలాగా నీటిలో మునగదు. దీని కింద ఒక పెద్ద రబ్బరు ట్యూబ్‌ లాంటిది ఉంటుంది.

  • అందులోకి శక్తివంతమైన ఫ్యాన్ల ద్వారా గాలిని గట్టిగా ఊదుతారు.

  • ఆ గాలి ఒత్తిడి వల్ల ఈ నౌక నేలకు లేదా నీటికి కొద్దిగా పైకి లేచి గాలిలో తేలుతూ ప్రయాణిస్తుంది!

  • దీని వెనుక వైపు విమానాలకు ఉన్నట్టు పెద్ద పెద్ద ఫ్యాన్లు  ఉంటాయి. ఇవి తిరుగుతూ నౌకను చాలా వేగంగా ముందుకు నెడతాయి.

  • సముద్ర తీరాల్లో దొంగలను పట్టుకోవడానికి, తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రంలో చిక్కుకున్న వారిని కాపాడటానికి మన కోస్ట్‌ గార్డ్‌ సైనికులు దీనిని వాడుతుంటారు.

ఇదీ చదవండి: ‘నాన్నా! దానికి ఎందుకు నమస్కరిస్తున్నావు?‘

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement