breaking news
kartika Monday
-
కార్తీక సోమవారం వేళ శిఖండి దర్శనం.. భక్తుల నమస్కారాలు!
సాక్షి, మహబూబాబాద్: కార్తీక సోమవారం వేళ ఇంటి ఆవరణలో రెండు తలల పాము కనిపించడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పాత డోర్నకల్‌లో ఈ ఆసక్తకర ఘటన చోటుచేసుకుంది.పాత డోర్నకల్‌కు చెందిన గండి సీతారాంగౌడ్ నివాస ఆవరణలో రెండు తలల పాము (శిఖండి) కనిపించింది. కార్తీక సోమవారం కావడంతో శివాలయాలకు వెళ్తున్న అయ్యప్ప స్వాములు, ఇతర భక్తులు పామును చూసేందుకు ఆసక్తి చూపారు. కొందరు భక్తులు భక్తిభావంతో పామును దర్శించుకుని నమస్కరించారు. సాధారణంగా పాము కనిపిస్తే భయపడే ప్రజలు.. రెండు తలలతో కనిపించడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అనంతరం పామును గోనె సంచిలోకి తీసుకుని శివాలయం సమీపంలోని చెట్టు వద్ద వదిలిపెట్టారు. కార్తీక సోమవారం రోజున ఈ ఘటన చోటుచేసుకోవడంతో పాత డోర్నకల్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: నష్టాల బస్సుకు ‘సెన్సర్’ ఊరట -
కిటకిటలాడుతున్న శైవ దేవాలయాలు
హైదరాబాద్: తొలి కార్తీక సోమవారం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో శైవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక సోమవారం కావడంతో రాజమండ్రి వద్ద గోదావరిలో అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా శివాలయాలు, పంచారామ క్షేత్రాలు ద్రాక్షారామం, సామర్లకోటలలో స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో శివాలయాలకు భక్తులుపోటెత్తారు. భీమవరం పంచారామ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. కర్నూలు జిల్లా శ్రీశైలం దేవాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. కరీంనగర్ జిల్లా వేములవాడ భక్తులతో కిటకిటలాడుతోంది. **


