pragnent
-
డెలివరీ టైమ్‌లో.. సైన్ కావాల్సి వస్తే?
నాకిప్పుడు తొమ్మిదోనెల. అమెరికా నుంచి వచ్చాను. ఇక్కడే డెలివరీ ప్లాన్ చేస్తున్నాను. మావారు యూఎస్‌లోనే ఉన్నారు. నా లేబర్ టైమ్‌లో ఏదైనా అవసరమైతే ఎవరిని అప్రోచ్ కావాలి? ఏదైనా సైన్ కావాల్సి వస్తే నేను ఒప్పుకుంటే సరిపోతుందా? – చిక్కేపల్లి మనోజ్ఞ, హైదరాబాద్ప్రెగ్నెన్సీ, డెలివరీ అనేవి ఆడవాళ్ల జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు. బిడ్డకు జన్మనివ్వడమనేది మరచిపోలేని అనుభూతిగా ఉండాలి. అలాంటి సురక్షితమైన ప్రసవానికి మంచి ఆసుపత్రి అవసరం. నిజానికి ఇది ఆడవాళ్ల ఫండమెంటల్ రైట్. దీన్ని అర్థం చేసుకున్న ఆసుపత్రి, అందులోని వైద్య సిబ్బంది.. డెసిషన్ మేకింగ్‌లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ చెకప్స్ నుంచి వైద్యపరీక్షలు, ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్ వంటి వాటన్నిట్లో మీ సమ్మతి తీసుకుంటారు. అంటే ఏదైనా మీ ఇష్టప్రకారమే జరగాలని అలా కన్సెంట్ అడుగుతారు.అలాగే ఏది సురక్షితమో కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చెయ్యరు. మీ కుటుంబం అభిప్రాయాన్ని, సలహా, సూచనలను మీరు ఎల్లవేళలా తీసుకోవచ్చు. కానీ మీ నిర్ణయాన్నే డాక్టర్ ఫాలో అవుతారు. ప్రెగ్నెన్సీ సమయంలో భావోద్వేగాలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, ప్రసవం వంటివాటికి సంబంధించిన అన్ని ప్రొసీజర్స్, టెస్ట్‌ల గురించి మీకు అర్థమయ్యే భాషలో రాసి ఉన్న బుక్లెట్స్ని మీకు ఇస్తారు. మీరు చదివాక మీ సందేహాలను తీరుస్తూ మళ్లీ ఒకసారి వాటన్నిటి గురించి సంబంధిత డాక్టర్ చక్కగా వివరిస్తారు.ప్రీనాటల్ టెస్ట్, లేబర్ ఇండక్షన్, ఫీటల్ మానిటరింగ్స్, వెజైనల్ ఎగ్జామినేషన్స్, ఎపిడ్యురల్స్, ఎపిసియోటమి, ఫోర్సెప్స్ డెలివరీ, సిజేరియన్ లాంటి అన్ని ప్రక్రియల గురించి.. వాటికున్న రిస్క్స్, బెనిఫిట్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకేది మంచిదో.. మీకేది సూట్ అవుతుందో చెప్తారు. ఫైనల్ డెసిషన్ మీరు తీసుకోవాలి. మీకు సురక్షితంగా ప్రసవం చేసే బాధ్యతను డాక్టర్ తీసుకుంటారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు ఆ టెస్ట్, ప్రొసీజర్, చెకప్ వద్దనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాల గురించీ చెప్తారు. వాటికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవడానికి తగిన సమయమూ ఇస్తారు.ఫలానా టెస్ట్ చేయకూడదు అని మీరు నిర్ణయించుకుంటే దాని పర్యవసానాల గురించి, తర్వాత ప్రెగ్నెన్సీ కేర్ ఎలా ఉంటుందో కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్యుమెంటేషన్ ప్రొసీజర్స్ కూడా వివరిస్తారు. అవన్నీ మీకు పూర్తిగా అర్థమయ్యే మీరు ఓ నిర్ణయానికి వచ్చారా అనీ చెక్ చేస్తారు. మీ భర్త, మీ కుటుంబం అభిప్రాయాన్ని మీరు పరిగణనలోకి తీసుకున్నా.. ఫైనల్‌గా మీరు చెప్పే నిర్ణయాన్నే డాక్టర్ కన్సిడర్ చేస్తారు. ఎలెక్టివ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్‌కి మీ సమ్మతి చాలా ముఖ్యం. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో ఏదైనా ప్రొసీజర్ చేయాల్సి వస్తే మీ నుంచి వర్బల్ కన్సెంట్ తీసుకుంటారు. లేబర్ వార్డ్ స్టాఫ్, నర్స్‌లు అందరూ సపోర్టివ్‌గానే ఉంటారు. మీకు సౌకర్యంగా ఉండేలా చూస్తారు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
గర్భిణికి దారి కష్టాలు..
మంచిర్యాల: రోడ్డు సదుపాయానికి నోచుకోని గిరిజన గ్రామం అది. అత్యవసర సమయంలో ఆస్పత్రికి వెళ్లాలంటే కాలినడకన లేదా ఎడ్లబండే గతి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు, వంకలు దాటాల్సిందే. 108 అంబులెన్స్ రాక, వైద్య సౌకర్యం అందక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నెన్నెల మండలం కోనంపేట పంచాయతీ పరిధిలోని పాటి గ్రామానికి చెందిన గిరిజన మహిళ రెడ్డి మల్లక్క మూడు నెలల గర్భిణి. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో దారిలేక ఆస్పత్రికి వెళ్లలేకపోయింది. బుధవారం తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎడ్లబండిపై లంబాడితండా ఎర్రవాగు వరకు తీసుకువచ్చారు. అక్కడ ఆటోలో ఎక్కించి అందరూ కలిసి అతికష్టం మీద వాగు దాటించి బెల్లంపల్లిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గతంలో దమ్మిరెడ్డిపేటకు చెందిన గిరిజనుడు జ్వరంతో బాధపడుతూ వాగు దాటలేక మృతి చెందాడు. ఎన్నికల ముందు సర్పంచ్ హామీ ఇచ్చినప్పటికీ రోడ్డు సౌకర్యం కల్పించలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే పాటి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకొని గిరిజనులు బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా నేతలు మారినా అధికారులు వచ్చి చూసినా దారిచూపే నేతలు లేక మా రాతలు మారడం లేదని గిరిజనులు గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, నాయకులు స్పందించి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. -
అమ్మ ప్రెగ్నెంట్ అని నాన్న చెప్పగానే షాకయ్యా: నటి ఆర్య పార్వతి
తన తల్లి కారణంగా మలయాళ నటి ఆర్య పార్వతి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. 47 ఏళ్ల వయసులో ఆమె తల్లి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. అంతేకాదు తాను అక్కను అయ్యానంటూ తన బుల్లి చెల్లి ఫొటో షేర్ చేస్తూ మురిసిపోయింది. అయితే లేటు వయసులో తన తల్లి బిడ్డకు జన్మనివ్వడంపై తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆర్య పార్వతి స్పందించింది. ఇది వినడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా.. అందులో సిగ్గుపడాల్సింది ఏముందని అభిప్రాయపడింది. చదవండి: రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన సంచలన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా అమ్మ ప్రెగ్నెన్సీ విషయం మా నాన్న ద్వారా తెలిసింది. అప్పటికే ఆమె 8నెలల గర్భవతి. ఆ సమయంలో ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. అవును.. 23 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల నుంచి ఇలాంటి వార్త వినాల్సి రావడంతో.. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. షాక్ అయ్యాను అనేకంటే ఆశ్చర్యపోయాను అని చెప్పాలి. 47 ఏళ్ల వయసులో తల్లి గర్భవతి అయ్యిందంటే అది ఇబ్బంది పెట్టే విషయమే అని తెలుసు. కానీ, నాకు తెలిసే సమయానికి అమ్మ 8 నెలల గర్భవతిగా ఉంది. తనకే ఈ విషయం 7వ నెలలో తెలిసింది’ అంటూ ఆర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం, పాపులర్ నటుడు కన్నుమూత ‘అయితే నాతో ఈ విషయం చెప్పేందుకు అమ్మ-నాన్న ఇబ్బంది పడ్డారట. ఇది చెప్పగానే నేను ఎలా రియాక్ట్ అవుతానోనని భయపడ్డారట. అందుకే కొంతకాలం ఈ విషయాన్ని నా దగ్గర దాచారు’ అని పేర్కొంది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నాన్న ఈ విషయం చెప్పిన తర్వాత తాను వెళ్లి తన అమ్మ ఒడిలో పడుకుని ఏడ్చానని చెప్పింది. ‘నిజానికి నేను ఎంతోకాలం దీనికోసమే ఎదురు చూశాను. నేనెందుకు సిగ్గుపడతాను’ అని అమ్మతో చెప్పానని ఆర్య పార్వతి చెప్పుకొచ్చింది. కాగా సోషల్ మీడియాలో ఆమె ఈ గుడ్‌న్యూస్ షేర్ చేయడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. -
కడుపులో బేబీ ఇలా గందరగోళం చేస్తుంది.. వీడియో షేర్ చేసిన లాస్య
యాంకర్ లాస్య మరోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఆమెకు కుటుంబ సభ్యులు సీమంతం వేడుకను ఘనంగా జరిపించారు. ప్రస్తుతం లాస్యకు తొమ్మిదో నెల. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లాస్య తాజాగా ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. తొమ్మిదో నెలలో బిడ్డ ఆమెను గందరగోళానికి గురి చేస్తున్నాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది. చదవండి: లాక్డౌన్లో ఆర్థిక కష్టాలు.. అంతలోనే లగ్జరీ హోం ఓనర్!: కమెడియన్ రఘు ఇల్లు చూశారా? ‘ఈ తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీలో బేబీ గందరగోళానికి గురిచేస్తుంది. 8వ నెల కంటే తొమ్మిదో నెలలోనే బేబీ కదలికలు ఎక్కువగా ఉంటాయి. తరచూ తంతూ ఉంటుంది. మీరే చూడండి’ అంటూ తన బేబీ బంప్ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం నెలలు నిండిన లాస్య త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతుంది. దీంతో ఆమెకు తన ఫాలోవర్స్, ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: గుసగుసలేం లేవు.. సీక్రెట్‌గా పెళ్లి తంతు.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన స్టార్స్ వీరే! View this post on Instagram A post shared by Lasya Chillale (@lasyamanjunath) -
తన ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై స్పందించిన హీరోయిన్
హీరో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. నిక్కీ గల్రానీ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్ నిక్కీ గల్రానీ సోషల్ మీడియా వేదిక స్పందించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ తాను గర్భవతి అంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ‘నేను ప్రెగ్నెంట్ అంటూ కొందరు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఓ పని చేయండి డెలివరి డేట్ కూడా మీరే చెప్పేయండి’ అంటూ స్మైలీ ఎమోజీని జత చేసింది. చదవండి: ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం శుభ్రం చేసుకో అన్నాడు: నిధి అగర్వాల్ అదే విధంగా ‘ప్రస్తుతానికి నేను ప్రెగ్నెంట్ కాదు. కానీ భవిష్యత్తులో మాత్రం ఇది తప్పకుండ జరుగుతుంది. అప్పడు నేనే స్వయంగా చెప్తాను. అప్పటి వరకు ఇలాంటి పుకార్లను నమ్మకండి’ అంటూ తన ప్రెగ్నెంట్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. కాగా కొన్నేళ్ల డేటింగ్ అనంతరం ఈ ఏడాది మేలో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టిలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. నిక్కీ, ఆది కలిసి ‘యగవరయినమ్ నా క్కాక’, ‘మరగధ నానయమ్’ సినిమాల్లో నటించారు. అదే సమయంలో వారిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే వారి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ బయటకు చెప్పలేదు. సీక్రెట్‌గా డేటింగ్ చేసిన ఆది-నిక్కీ ఈ ఏడాది పెళ్లి ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. చదవండి: తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్, నడవలేని స్థితిలో.. pic.twitter.com/1tucglygut — Nikki Galrani Pinisetty (@nikkigalrani) November 18, 2022 -
మహాలక్ష్మి తల్లి కాబోతుందా? ఫొటో వైరల్
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం ఈ జంట ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. దీనికి కారణం నిర్మాత రవీందర్ అతి బరువు ఉండటమే. మహాలక్ష్మి మాత్రం పొట్టిగా, నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రవీందర్ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్ చేశారు నెటిజన్లు. అయితే అవేవి తమను బాధించవని, తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామంటూ ట్రోల్స్‌పై ఈ జంట స్పందించింది. చదవండి: ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో.. అంతేకాదు తరచూ ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేస్తూ ట్రోలర్స్ నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది ఈ జంట. అయినప్పటికీ వారిపై ట్రోల్స్ ఆగడం లేదు. ఇదిలా ఉంటే ఈ జంట త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. మహాలక్ష్మి గర్భవతి అయినట్లు సోషల్ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ జంట డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫొటోలను షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను రవీందర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే ఈ ఫొటోలో మహాలక్ష్మీ కాస్తా లావుగా, పొట్ట భాగం ముందుకు ఉన్నట్లుంది. చూస్తుంటే ఆమె గర్భవతి అన్నట్లుగాకనిపించింది. దీంతో ఆమెను చూసి మహాలక్ష్మి ప్రెగ్నెంటా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు దీనికి రవీందర్ ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే అదే నిజం అనేట్టుగా ఉంది. చదవండి: అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్ కట్టలేక 2 నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక ‘ఐ లవ్ యూ చెప్పడంలోనే నా సంతోషం లేదు.. నేను వ్యక్తం చేయకపోయినా నువ్వు నా కోసమే జీవించావంటూ నువ్వు చూపించే నీ నిజమైన ప్రేమ కూడా కారణం’ అంటూ ఈ ఫొటోకి రాసుకొచ్చాడు. దీంతో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 1న ఈ జంట ఇరువురి కుంటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. కెరీర్ మధ్యలో, మహాలక్ష్మి అనిల్ నేరేడిమిల్లిని వివాహం చేసుకుంది. మహాలక్ష్మికి తన మొదటి భర్తతో మగబిడ్డ జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) -
ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. తల్లి కాబోతున్న ‘దేవత’ సీరియల్ నటి
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే దేవత సీరియల్ నటి వైష్ణవి ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టింన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం నటనకు గుడ్‌బై చెప్పిన ఆమె సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. సొంతంగా యూట్యూబ్ చానల్ పెట్టి తరచూ కొత్త వీడియోలతో ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. తాజాగా ఆమె కొత్త వీడియో రిలీజ్ చేస్తూ ఫాలోవర్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పింది. చదవండి: నిర్మాతలతో అలా ఉంటేనే హీరోయిన్లకు అవకాశాలు: నటి షాకింగ్ కామెంట్స్ తాను తల్లి కాబోతున్నానంటూ శుభవార్త పంచుకుంది. కొద్ది రోజులుగా తన యూట్యూబ్ చానల్లో ఎలాంటి అప్డేట్ ఇవ్వని వైష్ణవి.. తాజాగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో చెబుతూ అసలు విషయం చెప్పేసింది. ‘మా ఇంట్లోకి ఓ కొత్త మెంబర్ రాబోతున్నారు. నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక ఇంతకాలం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. చాలా వేయిట్ చేసిన అనంతరం ఇప్పుడు మీతో ఈ గుడ్‌న్యూస్ పంచుకుంటున్నా’ అని పేర్కొంది. అలాగే తన ఆరోగ్యం కూడా బాగుండటం లేదని, ఏం తిన్న వాంతులు అవుతున్నాయని చెప్పుకొచ్చిది. చదవండి: ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే.. ఇంట్లో అందరు ప్రతి రెండు, మూడు గంటలకు తిను తిను అంటూ ఇబ్బంది పెడుతున్నారంంది. అనంతరం ప్రస్తుతం తాను రెండు నెలల గర్భవతినని తెలిపింది. అంతేగాకు ప్రెగ్నెన్సి సమయంలో తల్లిగా తను పాటించాల్సి జాగ్రత్తలు ఎంటనేవి కూడా కామెంట్స్ రూపంలో సూచించాలని, మీ అందరి సహకారం కావాలంటూ ఫాలోవర్స్‌ను కోరింది. ఆమె షేర్ చేసిన ఈ స్పెషల్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వైష్ణవి తల్లి కాబోతుందని తెలిసి ఆమె ఫాలోవర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
గుడ్‌న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్, బేబీ బంప్‌తో సర్ప్రైజ్
బాలీవుడ్ బ్యూటీ బిపాషా తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. తాను తల్లికాబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా ఇటీవల ఆమె గర్భవతి అయినట్లు వార్తలు వినిపించగా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో అందరిలో సందేహాలు నెలకొనగా ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ బిపాషా అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో కలిసి బేబీబంప్‌తో ఫోజులు ఇచ్చిన ఫొటోలను షేర్ చేస్తూ త్వరలోనే తమ బేబీ రాబోతున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా బిపాషా ఎమోషనల్ నోట్ పంచుకుంది. చదవండి: బాలీవుడ్‌కు బాయ్‌కాట్ సెగ, మరో స్టార్ హీరోపై విరుచుకుపాటు ‘మా జీవితంలోకి మరింత సంతోషం జతకానుంది. కొంతకాలంగా వేరువేరుగా జీవించిన మేం(బిపాషా-కరణ్ సింగ్ గ్రోవర్) ఒక్కటయ్యాం. మా మధ్య ఉన్న అపారమైన ప్రేమ అనంతరం ఇద్దరం కాస్తా ముగ్గురుగా కాబోతున్నాం. త్వరలోనే మా బిడ్డ మాతో కలవబోతోంది. మాపై చూపించిన మీ ప్రేమ, అప్యాయతలకు కృతజ్ఞురాలిని’ అంటూ బిపాషా రాసుకొచ్చింది. కాగా ఎంతోకాలంగా పరిశ్రమలో తన అందచందాలతో కుర్రకారును అల్లాడించిన బిపాషా బసు ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో ‘ఎలోన్’ సినిమాలో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్తో తొలిసారి జతకట్టింది. ఈ మూవీ షూటింగ్లో ప్రేమలో పడ్డ వీరిద్దరు కొన్ని నెలల డేటింగ్ అనంతరం 2016లో పెళ్లి చేసుకుని ఒక్కటైన సంగతి తెలిసిందే. చదవండి: సింగర్ రాహుల్ జైన్‌పై అత్యాచారం కేసు View this post on Instagram A post shared by bipashabasusinghgrover (@bipashabasu) -
అమానుష ఘటన: గర్భిణిని కింద పడేసి, కాళ్లతో తన్ని...
కరాచి: పాకిస్తాన్ ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. గర్భిణి అన్న కనికరం లేకుండా కొట్టి కొందపడేసి బూట్లతో తన్ని దారుణంగా ప్రవర్తించాడు ఒక సెక్యూరిటి గార్డు. పోలీసులు తెలపిన కథనం ప్రకారం....పాకిస్తాన్‌లోని కరాచీలో నోమన్ గ్రాండ్ సిటీ అనే అపార్టమెంట్స్ గులిస్తాన్-ఎ-జౌహర్ బ్లాక్ 17లో ఉంది. సనా అనే ఒక ఐదు నెలల గర్భిణి ఆ ఆపార్టమెంట్స్ లోనే పనిమనిషిగా పనిచేస్తోంది. ఐతే ఆమె తన కొడుకు సోహిల్ తన కోసం ఆహారం తీసుకువచ్చాడని తనని లోపలికి అనుమతించాల్సిందిగా ఆ ఆపార్టమెంట్ సెక్యూరిటీ గార్డుని వేడుకుంది. ఐతే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అబ్దుల్ నాసిర్, అదిల్ ఖాన్, మహ్మద్ ఖలీల్ లోపలకి రావడాని అంగీకరించలేదు. దీంతో సదరు మహిళ అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగింది. ఐతే ఆ సెక్యూరిటీ గార్డు కోపంతో ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. తిరిగి లేచేందుకు ప్రయత్నించే లోపే బూట్లతో ముఖం పై తన్ని అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ స్ప్రుహ కోల్పోయింది. ఈ సంఘటన సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడ్డంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. పైగా ఆ గార్డు అంత క్రూరంగా ఎలా ప్రవర్తించాడంటూ మండిపడ్డారు. ఆ గార్డు పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు కూడా. (చదవండి: కలెక్టర్ టీనా దాబికే షాకిచ్చాడు.. మాములు ఐడియా కాదుగా..) -
మరోసారి తల్లికాబోతున్న ఐశ్వర్య?.. వీడియో వైరల్
అందాల తార ఐశ్వర్యరాయ్ మరోసారి గర్భవతి అయ్యిందా? అంటూ కొద్ది రోజులుగా బి-టౌన్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గతంలోనూ ఐష్ రెండోసారి తల్లికాబోతుందంటూ వార్తలు వచ్చినా ఈసారి మాత్రం కాస్తా గట్టిగానే వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఇటీవల విమానాశ్రయంలో కనిపించిన ఐశ్వర్య వీడియోనే. ముంబై విమానాశ్రయంలో భర్త అభిషేక్ బచ్చన్, కూతరు ఆరాధ్యలతో కలిసి ఐశ్వర్య దర్శనం ఇచ్చింది. చదవండి: నటికి షాకిచ్చిన కొత్త బాయ్‌ఫ్రెండ్, 2 గంటల పాటు ఎయిర్ పోర్టులోనే.. ఇందులో ఐష్ కాస్తా బొద్దుగా, పొట్ట భాగంగా ముందుకు ఉన్నట్లుగా అనిపించింది. అంతేకాదు ఈ వీడియోలో ఆమె తన పొట్టను దాచే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా కనిపించడంతో అందరూ ఆమె ప్రెగ్నెంట్ అని ఫిక్స్ అయిపోయారు. దీంతో తాను మరోసారి గర్భవతి అయ్యిందని, అందుకే పొట్ట భాగాన్ని కవర్ చేసుకుంటుందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పొరపాటు పడ్డ ఈ సారి మాత్రం ఐష్ నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యిందంటూ ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. ‘బచ్చన్ ఫ్యామిలీ బుల్లి వారసుడు రావాలని, ఆరాధ్య పాపకు తమ్ముడు వస్తున్నాడు’ అంటూ ఆ వీడియోకు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తన ప్రెగ్నెన్సీ రూమర్లపై ఐష్ స్పందించకపోవడం గమనార్హం. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే బచ్చన్ ఫ్యామిలీ స్పందించేవరకు వేచి చూడక తప్పదు. కాగా 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌లకు వివాహం కాగా.. 2011 నవంబర్ 16న వీరికి ఆరాధ్య జన్మించింది. Is Aishwarya Rai Bachchan pregnant? Viral videos, pictures spark speculations Read @ANI Story | https://t.co/jeCE6Ilkqi#AishwaryaRai #AishwaryaRaiBachachanPregnant #AbhishekBachchan #Bollywood pic.twitter.com/Lzf58ir3qE — ANI Digital (@ani_digital) July 20, 2022 -
ట్విట్టర్లో స్పందించి.. సాయం అందించి!
మహబూబ్‌నగర్ రూరల్: సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ వినతికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ నిండుగర్భిణికి అభయహస్తం అందించారు. వివరాల్లోకి వెళితే... మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మసానిపల్లికి చెందిన ప్రియాంక నిండుగర్భిణి. రెండు నెలల క్రితం భర్త ఓ కేసులో జైలు పాలయ్యాడు. ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. ప్రసూతి కోసం ఆర్థికసాయం చేయాలని పక్కింటిలో ఉండే రాజేశ్వరి ఈ నెల 22న స్టార్ బాయ్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రహెమాన్, రసూల్‌ఖాన్‌కు సమాచారమిచ్చారు. ప్రియాంకకు సాయం చేయాల్సిందిగా వీరు స్థానిక యూట్యూబ్ చానల్లో ఓ వీడియో పోస్టు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఎస్.మనోహర్‌గౌడ్ అనే వ్యక్తి గమనించి దీనిపై సోమవారం ఉదయం 7.30 గంటలకు మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో పోస్టు చేశారు. వెంటనే కేటీఆర్ స్పందించి జిల్లామంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు విషయం చెప్పి బాధితురాలికి అవసరమైన సహాయం చేయాలని సూచించారు. కాగా, ఆమెను అప్పటికే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా 8.30 గంటలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరోవైపు మధ్యాహ్నం 2.30 గంటలకు ఐసీడీఎస్ ఇన్చార్జి, డీడబ్ల్యూఓ రాజేశ్వరి తిమ్మసానిపల్లికి వెళ్లి ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని బాలింతకు అవసరమైన దుస్తులు, పండ్లు సమకూర్చారు. మంగళవారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే తల్లీబిడ్డలను స్టేట్‌హోంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. -
గడ్డకట్టే చలిలో.. బికినీ ధరించి బాల్కనీలో
మాస్కో: ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత మనుషుల్లో అసాధరణ ధోరణులు కూడా ఎక్కువయ్యాయి. రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలని భావించి చేసే పనులు ప్రాణాల మీదకు తేస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి రష్యాలో చోటు చేసుకుంది. య్యూట్యూబర్ ఒకరు 1300 డాలర్లకు ఆశపడి చేసిన బుర్రతక్కువ పని వల్ల గర్భవతి అయిన అతడి గర్ల్‌ఫ్రెండ్ మరణించింది. వివరాలు.. ఒక యూజర్ ప్రాంక్ వీడియో చేస్తే 1300 డాలర్లు ఇస్తాననడంతో స్టాస్ రిఫ్లే(30) అనే యూట్యూబర్ లైవ్ స్ట్రీమ్‌లో భాగంగా తన గర్ల్‌ఫ్రెండ్ వాలెంటినా గ్రిగోరీవా మీద ప్రాంక్ వీడియో చేయాలని భావించాడు. ఇక దానిలో భాగంగా స్టాస్, గర్భవతి అయిన వాలెంటినాను బాల్కనీలో ఉంచి తాళం వేశాడు. బయట విపరీతమైన చలి... మంచు కురుస్తుంది. దారుణం ఏంటంటే ప్రాంక్ వీడియో కోసం వాలెంటినా బికినీ వేసుకుని బాల్కనీలో నిల్చుని ఉంది. దాదాపు 15 నిమిషాల పాటు గట్టకట్టుకుపోయే చలిలో ఉండటంతో వాలెంటినా మరణించింది. చలికి తట్టుకోలేక మధ్యలో డోర్ కొట్టింది కానీ స్టాస్ తలుపు తీయలేదు. దాంతో ఆమె రక్తం గడ్డకట్టుపోయి.. శ్వాస తీసుకోవడానికి కుదరక.. కడుపులో బిడ్డతో సహా మరణించింది. (గుడ్డు పగిలింది: రివేంజ్ అదిరింది) 15 నిమిషాల తర్వాత స్టాస్ ఆమెని ఇంటి లోపలికి తీసుకెళ్లి బ్లాంకెట్ కప్పాడు. కానీ అప్పటికే ఆమె మరణించింది. వాలెంటీనాను లోపలకి తీసుకువచ్చిన స్టాస్ ఆమెను లేపేందుకు ప్రయత్నించాడు. ‘వాల్య నీకు ఏమైంది.. ఎందుకు ఇలా చలనం లేకుండా పడి ఉన్నావ్.. దేవుడా నువ్వు మరణించావా ఏంటీ.. గైస్ ఆమె నాడి కోట్టుకోవడం లేదు.. శ్వాస తీసుకోవడం లేదు.. శరీరం పాలిపోయింది’ అంటూ అరవడం వీడియోలో వినిపించింది. స్టాస్ ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లాడు కానీ అప్పటికే వాలెంటినా మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ మొత్తం తతంగం లైవ్ స్ట్రీమ్ కావడంతో పోలీసులు స్టాస్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోని యూట్యూబ్ డిలీట్ చేయడమే కాక ఇలాంటి దారుణాలకు పాల్పడటం నేరం అంటూ హెచ్చరించింది. -
108 రాకపోవడంతో రోడ్డుపైనే ప్రసవం..
సాక్షి, నల్గొండ: జిల్లాలో దారుణం చోటు జరిగింది. పురిటి నోప్పులతో బాధపడుతున్న ఓ మహిళను ఆసుపత్రికి తరలించడానికి సరైన సమయానికి 108 వాహనం రాకపోవడంతో సదరు మహిళ రోడ్డుపైనే ప్రసవించిన ఘటన సూర్యపేటలో బుధవారం అర్థరాత్రి చేసుకుంది. బాధిత మహిళ అర్వపల్లి మండలం రామన్న గూడెంకు చెందిన దండకొండ వెంకన్న భార్య రేష్మ. ఆమె గర్భవతి కావడంతో నిన్న అర్థరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. ఇక వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సమయానికి రాలేదు. దీంతో బాధిత మహిళ భర్త వెంకన్న తన ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా సూర్యపేట పాతబస్టాండ్ వద్దకు రాగానే ఆమె దారిలోనే ప్రసవించింది. ఇంతలో పేన్ పహాడ్ నుంచి వస్తున్న 108 వాహనంలో ఆమె స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు ఆమె భర్త వెంకన్న తెలిపాడు. కాగా లాక్డౌన్ కారణంగా అంతటా భారీకేడ్లు ఏర్పాటు చేశారని, అంబులెన్స్ కూడా రాకపోవడం వలన సమయం మించిపోవడంతో తన భార్య రోడ్డు మీదనే ప్రసవించిందని బాధితుడు మీడియా ఎదుట వాపోయాడు. ఇక ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంటును మీడియా వివరణ కోరగా వారు దురుసుగా ప్రవర్తిస్తూ.. సమాధానం ఇచ్చి విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. -
‘ఆరోగ్యలక్ష్మి’తో గర్భిణులకు మేలు
ఎంజీఎం వరంగల్ : ఆరోగ్య లక్ష్మి కార్యక్రమంతో గర్భిణులకు మేలు జరుగుతుందని డీఎంహెచ్ఓ హరీష్ రాజు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అదేశాలతో ‘ఆరోగ్య లక్ష్మి’ కార్యక్రమంలో భాగంగా అర్బన్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శుక్రవారం గర్బిణీ స్త్రీలకు పోషకాహారాన్ని అందించేందుకు వైద్యాధికారులతో ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వివరించారు. బుధవారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అ«ధికారి శైలజ.. వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ హరీశ్‌రాజు మాట్లాడుతూ ‘ఆరోగ్య లక్ష్మి’ కార్యక్రమంలో భాగంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోషకాహారాన్ని పీహెచ్సీ, యూపీహెచ్‌సీలలో అందిస్తారన్నారు. గర్భిణులకు పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం వారికి భోజనం, పాలు, గుడ్లు అందిం చ నున్నట్లు తెలిపారు. పాలు, గుడ్లను దగ్గరలోని అంగన్వాడీ కేంద్రం నుంచి పీహెచ్íసీకి అందించడం జరుగుతుందన్నారు.ల సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ లలితాదేవి, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, కృష్ణారావు, డెమో అశోక్‌రెడ్డి, సీడీపీఓ మాధురి, సులోచన, రమణమూర్తి వైద్యాధికారులు పాల్గొన్నారు. -
108 డోరు తెరుచుకోక గర్బిణి అవస్థలు
-
తెరుచుకోని '108' డోరు.. గర్భిణి అవస్థలు
మెదక్: 108 అంబులెన్స్ ల దుస్థితి ఎలా ఉందో ఈ సంఘటన చూస్తే అర్ధమవుతోంది.108 డోర్ తెరుచుకోకపోవడంతో నిండు గర్భిణి అరగంట పాటు విలవిల్లాడిన సంఘటన మెదక్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. సదశివపేట మండలం ఆరూర్ గ్రామానికి చెందిన మమత నిండు గర్భిణి. ఉదయం నుంచి ఆమెకు నొప్పులు మొదలవడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. ఆమెను ఎక్కించుకున్న అంబులెన్స్ ఆస్పత్రికి చేరుకున్నాక వాహనం తలుపులు తెరుచుకోలేదు. దీంతో అరగంట పాటు మమత నొప్పులతో యాతన అనుభవించింది. గమనించిన అస్సత్రి సిబ్బంది అంబులెన్స్ డోర్‌ను కర్రలు, ఇనుపరాడ్డుల సాయంతో బద్దలు కొట్టి గర్భిణిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ సంఘటనపై స్తానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.