గుడ్‌న్యూస్‌ చెప్పిన స్టార్‌ హీరోయిన్‌, బేబీ బంప్‌తో సర్‌ప్రైజ్‌ | Sakshi
Sakshi News home page

Bipasha Basu: గుడ్‌న్యూస్‌ చెప్పిన స్టార్‌ హీరోయిన్‌, బేబీ బంప్‌తో సర్‌ప్రైజ్‌

Published Tue, Aug 16 2022 12:49 PM

Bipasha Basu, Karan Singh Grover Finally Makes Pregnancy Official - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ బిపాషా తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తాను తల్లికాబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా ఇటీవల ఆమె గర్భవతి అయినట్లు వార్తలు వినిపించగా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో అందరిలో సందేహాలు నెలకొనగా ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ బిపాషా అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో కలిసి బేబీబంప్‌తో ఫోజులు ఇచ్చిన ఫొటోలను షేర్‌ చేస్తూ త్వరలోనే తమ బేబీ రాబోతున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా బిపాషా ఎమోషనల్‌ నోట్‌ పంచుకుంది.

చదవండి: బాలీవుడ్‌కు బాయ్‌కాట్‌ సెగ, మరో స్టార్‌ హీరోపై విరుచుకుపాటు

‘మా జీవితంలోకి మరింత సంతోషం జతకానుంది. కొంతకాలంగా వేరువేరుగా జీవించిన మేం(బిపాషా-కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌) ఒక్కటయ్యాం. మా మధ్య ఉన్న అపారమైన ప్రేమ అనంతరం ఇద్దరం కాస్తా ముగ్గురుగా కాబోతున్నాం. త్వరలోనే మా బిడ్డ మాతో కలవబోతోంది. మాపై చూపించిన  మీ ప్రేమ, అప్యాయతలకు కృతజ్ఞురాలిని’ అంటూ బిపాషా రాసుకొచ్చింది. కాగా ఎంతోకాలంగా పరిశ్రమలో తన అందచందాలతో కుర్రకారును అల్లాడించిన బిపాషా బసు ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో ‘ఎలోన్‌’ సినిమాలో నటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో తొలిసారి జతకట్టింది. ఈ మూవీ షూటింగ్‌లో ప్రేమలో పడ్డ వీరిద్దరు కొన్ని నెలల డేటింగ్‌ అనంతరం 2016లో పెళ్లి చేసుకుని ఒక్కటైన సంగతి తెలిసిందే. 

చదవండి: సింగర్‌ రాహుల్‌ జైన్‌పై అత్యాచారం కేసు

Advertisement
 
Advertisement
 
Advertisement