తెరుచుకోని '108' డోరు.. గర్భిణి అవస్థలు | 108 ambulance door locked in medak hospital | Sakshi
Sakshi News home page

తెరుచుకోని '108' డోరు.. గర్భిణి అవస్థలు

Jun 24 2015 10:51 AM | Updated on Sep 3 2017 4:18 AM

తెరుచుకోని '108' డోరు.. గర్భిణి అవస్థలు

తెరుచుకోని '108' డోరు.. గర్భిణి అవస్థలు

108 అంబులెన్స్ ల దుస్థితి ఎలా ఉందో ఈ సంఘటన చూస్తే అర్ధమవుతోంది.

మెదక్:  108 అంబులెన్స్ ల దుస్థితి ఎలా ఉందో ఈ సంఘటన చూస్తే అర్ధమవుతోంది.108 డోర్ తెరుచుకోకపోవడంతో నిండు గర్భిణి అరగంట పాటు విలవిల్లాడిన సంఘటన మెదక్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. సదశివపేట మండలం ఆరూర్ గ్రామానికి చెందిన మమత నిండు గర్భిణి. ఉదయం నుంచి ఆమెకు నొప్పులు మొదలవడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. ఆమెను ఎక్కించుకున్న అంబులెన్స్ ఆస్పత్రికి చేరుకున్నాక వాహనం తలుపులు తెరుచుకోలేదు. దీంతో అరగంట పాటు మమత నొప్పులతో యాతన అనుభవించింది.  గమనించిన అస్సత్రి సిబ్బంది అంబులెన్స్ డోర్‌ను కర్రలు, ఇనుపరాడ్డుల సాయంతో బద్దలు కొట్టి గర్భిణిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ సంఘటనపై స్తానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement