కుయ్‌.. కుయ్‌.. మూగబోతోంది: వైఎస్‌ జగన్‌ | Jagan Tweet On Chandrababu Negligence On 108 Ambulance Services | Sakshi
Sakshi News home page

కుయ్‌.. కుయ్‌.. మూగబోతోంది: వైఎస్‌ జగన్‌

Sep 22 2025 7:10 PM | Updated on Sep 22 2025 7:47 PM

Jagan Tweet On Chandrababu Negligence On 108 Ambulance Services

సాక్షి, తాడేపల్లి: 108 అంబులెన్స్ రాక శిశువు మృతి చెందటంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వీడియోతో సహా ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. ‘‘కుయ్‌.. కుయ్‌.. మూగబోతోంది.. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు ప్రభుత్వం ఉరివేస్తోంది’’ అంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది. చివరకు ఆటోలోనే ప్రసవం జరిగింది. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించింది. వైఎస్సార్‌సీపీ హయాంలో అంబులెన్స్‌లు, పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలన్న నిబంధన ఉంటే, దాన్ని అధిగమిస్తూ 12-14 నిమిషాల్లోనే చేరుకునేవి.

..గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే, 16-17 నిమిషాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే, దీన్నికూడా అధిగమిస్తూ 22.12 నిమిషాల్లోనే చేరుకుని 108లు సేవలందించాయి. మరి ఎందుకు ఇప్పుడు చేరుకోవడంలేదు?. ఫోన్‌ చేసినా ఎందుకు రావడంలేదు?. ప్రభుత్వం అన్నది పని చేస్తేనే కదా?. కలెక్షన్ల మీద తప్ప ప్రజల మీద ధ్యాస ఉంటేకదా?’’ అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement