కడుపులో బేబీ ఇలా గందరగోళం చేస్తుంది.. వీడియో షేర్‌ చేసిన లాస్య | Anchor Lasya Shared her 9th Month Pregnant Video Goes Viral | Sakshi
Sakshi News home page

Anchor Lasya: కడుపులో బేబీ ఇలా గందరగోళం చేస్తుంది.. వీడియో షేర్‌ చేసిన లాస్య

Published Mon, Mar 6 2023 9:13 PM | Last Updated on Mon, Mar 6 2023 9:23 PM

Anchor Lasya Shared her 9th Month Pregnant Video Goes Viral - Sakshi

యాంకర్‌ లాస్య మరోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఆమెకు కుటుంబ సభ్యులు సీమంతం వేడుకను ఘనంగా జరిపించారు. ప్రస్తుతం లాస్యకు తొమ్మిదో నెల. కాగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లాస్య తాజాగా ఓ ఆసక్తికర వీడియోను షేర్‌ చేసింది. తొమ్మిదో నెలలో బిడ్డ ఆమెను గందరగోళానికి గురి చేస్తున్నాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేసింది.

చదవండి: లాక్‌డౌన్‌లో ఆర్థిక కష్టాలు.. అంతలోనే లగ్జరీ హోం ఓనర్‌!: కమెడియన్‌ రఘు ఇల్లు చూశారా?

‘ఈ తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీలో బేబీ గందరగోళానికి గురిచేస్తుంది. 8వ నెల కంటే తొమ్మిదో నెలలోనే బేబీ కదలికలు ఎక్కువగా ఉంటాయి. తరచూ తంతూ ఉంటుంది. మీరే చూడండి’ అంటూ తన బేబీ బంప్‌ వీడియో షేర్‌ చేసింది. ప్రస్తుతం  నెలలు నిండిన లాస్య త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతుంది. దీంతో ఆమెకు తన ఫాలోవర్స్‌, ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

చదవండి: గుసగుసలేం లేవు.. సీక్రెట్‌గా పెళ్లి తంతు.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన స్టార్స్‌ వీరే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement