హక్కుల ఉల్లంఘనపై నోబెల్ విజేత నవీ పిళ్లై తీవ్ర ఆవేదన | Nobel Laureate Navi Pillay Vows To Continue Fighting Human Rights Violations, War Crimes And Discrimination Across The World | Sakshi
Sakshi News home page

హక్కుల ఉల్లంఘనపై నోబెల్ విజేత నవీ పిళ్లై తీవ్ర ఆవేదన

Oct 15 2026 9:32 AM | Updated on Oct 15 2026 10:01 AM

I will retire when human rights violations end Nobel laureate Navi Pillay

న్యూఢిల్లీ: ‘మనిషి ప్రాథమిక స్వేచ్ఛను, గౌరవాన్ని కాలరాసే దారుణాలు ప్రపంచవ్యాప్తంగా నిత్యకృత్యమవుతుండటం తీవ్రంగా కలచివేస్తోంది. ప్రపంచంలో ఎక్కడో ఒకచోట సాగుతున్న సాయుధ పోరాటాలు, గ్యాంగ్ వార్లలో అమాయకులు బలికావడం, ముఖ్యంగా యుద్ధరంగంలోనూ, ఇళ్ల నాలుగు గోడల మధ్య మహిళలపై సాగుతున్న దారుణ హింస మానవత్వానికే తీరని మచ్చగా మిగిలిపోతున్నాయి. వయసు పైబడినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా, మానవ హక్కుల ఉల్లంఘనలు పూర్తిగా అంతమయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటానని, అప్పుడే నా పదవీ విరమణ’ అంటూ నోబెల్ శాంతి విజేత నవీ పిళ్లై ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీలంక అంతర్యుద్ధం ముగిసి పదహారేళ్లకు పైగా గడుస్తున్నా, యుద్ధం మిగిల్చిన గాయాలతో బాధితులు ఇప్పటికీ న్యాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూస్తున్నారు. యుద్ధంలో తప్పిపోయిన తమ కన్నబిడ్డలు, ఆప్తులు బతికున్నారా లేదో అనే కనీస నిజం కూడా తెలియక అల్లాడిపోతున్న కుటుంబాల ఆర్తనాదాలు గుండెలను పిండేస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో అమానవీయమైన వర్ణవివక్ష అంతరించినట్లే, ప్రపంచదేశాల నిరంతర మద్దతు, సమష్టి పోరాటాల ద్వారానే ఈ బాధితులకు నిజమైన న్యాయం చేకూరుతుందని నవీ పిళ్లై పేర్కొన్నారు.

సమాజంలో మానవత్వాన్ని దెబ్బతీసే కుల వివక్ష ఇంకా కొనసాగుతుండటం తీవ్ర విచారకరం. ఆధునిక కాలంలో, భారతదేశంలో పటిష్టమైన రాజ్యాంగం, కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కొన్ని వర్గాల్లో ఈ వివక్ష పలు రూపాల్లో ఇంకా సజీవంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పూర్వం కూలీలుగా వలస వెళ్లిన వారు కూడా ఈ దురాచారాన్ని మోసుకెళ్లారని గుర్తుచేస్తూ, తోటి మనిషిని సమానంగా గౌరవించలేని ఇలాంటి బుద్ధిహీనమైన ఆచారాల పట్ల ప్రజల్లో అంతర్మథనం కలగాలని, ప్రతి ఒక్కరినీ సమానంగా ఆదరించడమే అసలైన నాగరికత అని ఆమె పిలుపునిచ్చారు.

సమస్యలను చూసి నిరాశ చెందకుండా యువత ధైర్యంగా గళమెత్తాలని ఆమె ఉద్బోధించారు. గతాన్ని పోల్చుకుంటూ, వచ్చిన మార్పులను గుర్తిస్తూనే, వ్యవస్థలోని అన్యాయాలను ఎదిరించి, తమ హక్కులను గట్టిగా డిమాండ్ చేసే తత్వం నేటి తరానికి అత్యంత అవసరం. ప్రపంచంలో అణచివేతకు గురవుతున్న ప్రతి అభాగ్యుడికి కనీసం నైతిక మద్దతునైనా అందించడం బాధ్యతాయుత సమాజ కర్తవ్యమని, యువత ఆ దిశగా కదిలి మార్పు తీసుకురావాలని నవీ పిళ్లై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Bihar: కాల్పుల కలకలం: మాజీ కస్టమ్స్ సూపరింటెండెంట్ హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement