Bihar: కాల్పుల కలకలం: మాజీ కస్టమ్స్ సూపరింటెండెంట్ హత్య | Bihar former customs Superintendent Ramkumar Singh shot dead | Sakshi
Sakshi News home page

Bihar: కాల్పుల కలకలం: మాజీ కస్టమ్స్ సూపరింటెండెంట్ హత్య

Oct 15 2026 8:46 AM | Updated on Oct 15 2026 8:46 AM

Bihar former customs Superintendent Ramkumar Singh shot dead

ఆరా: బీహార్‌లోని భోజ్‌పుర్ జిల్లా కేంద్రం ఆరాలో గురువారం తెల్లవారుజామున తుపాకుల మోతతో భయానక వాతావరణం నెలకొంది. జైన్ కాలేజీ సమీపంలోని కనక్‌పురి ప్రాంతంలో బైక్‌పై వచ్చిన దుండగులు మాజీ కస్టమ్స్ సూపరింటెండెంట్‌పై కాల్పులు జరిపి హతమార్చారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మృతుడు బిహియా పోలీస్ స్టేషన్ పరిధిలోని డుమ్రియా గ్రామానికి చెందిన 72 ఏళ్ల రామ్‌కుమార్ సింగ్‌గా గుర్తించారు.

ఆయన చాలా కాలంగా ఆరాలోని నవాదా పోలీస్ స్టేషన్ పరిధిలోని కనక్‌పురి ప్రాంతంలో ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత ఆయన సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. రామ్‌కుమార్ సింగ్ ఉదయం వాకింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇంటికి సుమారు 150 మీటర్ల దూరంలో, అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న బైక్‌పై వచ్చిన మాస్క్‌లు ధరించిన దుండగులు ఆయనను చుట్టుముట్టారు. ఆ తర్వాత ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఆయన శరీరంలోకి దాదాపు ఎనిమిది బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యకు పాల్పడిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పుల విషయం తెలియగానే పరిసర ప్రాంతాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే నవాదా పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య వెనుక గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. 

ఇదీ చదవండి: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దీప్కేకు చేదు అనుభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement