రోప్‌వే ప్రమాదం.. బిక్కుబిక్కుమన్న 300 మంది | tourists stranded mid air after major technical fault hits gulmarg | Sakshi
Sakshi News home page

రోప్‌వే ప్రమాదం.. బిక్కుబిక్కుమన్న 300 మంది

May 26 2026 4:40 AM | Updated on May 26 2026 4:49 AM

tourists stranded mid air after major technical fault hits gulmarg

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ ‌ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్‌లో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గొండోలా అని పిలిచే కేబుల్‌ కార్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో 65 క్యాబిన్లు ఎక్కడితక్కడే ఆగిపోయాయి. దీంతో అందులో ఉన్న టూరిస్టులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అందులో గడిపారు.

సోమవారం మధ్యాహ్నం గుల్మార్గ్‌లో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.  గుల్మార్గ్ను కాంగ్డోరికి వెళ్లే కేబుల్ కార వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో   అందులోని సుమారు 300 మంది ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గాల్లోనే ఉండిపోయారు.వాటిలో  కొన్ని క్యాబిన్లు 500 అడుగుల ఎత్తులో ఆగిపోగా పర్యాటకులు భయంతో హాహాకారాలు చేశారు. ఇది చాలదన్నట్లు   భారీ వర్షం కురియడంతో అందులోని పర్యాటకులు బెంబేలెత్తిపోయారు.

అయితే ఈ వివరాలు తెలుసుకున్న భారత సైన్యం వెంటనే స్పందించిందిదాదాపు ఐదు గంటలపాటు శ్రమించి మొదటి విడతగా క్యాబిన్లలో ఉండిపోయిన 179 మంది పర్యాటకులను సైనికులు సురక్షితంగా కిందికి దించారు. అనంతరం మరో రెండు గంటల అనంతరం వారినీ రక్షించారు. పోలీసులు, ఆర్మీతోపాటు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సభ్యులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

అయితే గతంలోనూ ఓ సారి కేబుల్ కార్‌ వ్యవస్థలో లోపం తలెత్తింది.  జూన్ 25, 2017 న బలమైన ఉరుముల సమయంలో, గోండోలా యొక్క కేబుల్ లైన్లో ఒక చెట్టు పడిపోయింది.  క్యాబిన్లో 100 అడుగుల కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement