జమ్మూ కశ్మీర్: ఉదమ్‌పుర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.