Bangladesh : నదిలో పడిన బస్సు 23 మంది మృతి | Horrific Road Accident in Bangladesh | Sakshi
Sakshi News home page

Bangladesh : నదిలో పడిన బస్సు 23 మంది మృతి

Mar 26 2026 4:00 AM | Updated on Mar 26 2026 7:43 AM

Horrific Road Accident in Bangladesh

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్‌బారి జిల్లాలోని దౌలడియా టెర్మినల్ వద్ద 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దురదృష్టవశాత్తు పద్మానదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

ఇటీవల ఈద్‌ సెలవులు  ముగించుకొని ఢాకాకు  తిరుగు ప్రయాణమవుతుండగా  ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు లోపల 14 మృతదేహాలు లభించాయి.  ప్రమాదంలో గల్లంతైన మిగిలిన ప్రయాణికుల కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement