సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ జామర్ కారుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఎగ్జిట్ 17 వద్ద రన్నింగ్ లోనే సీఎం కాన్వాయ్ జామార్ టైర్ పగిలింది. జామార్ కుడి వైపు ఉన్న వెనుక టైర్ అకస్మాత్తుగా పగిలిపోవడంతో వాహనాన్ని డ్రైవర్ చాకచక్యంగా కంట్రోల్ చేశాడు.
విషయం తెలుసుకున్న ట్రాఫిక్ టీమ్ వెంటనే స్పందించి స్టెప్నీ టైర్ మార్చారు. జామార్‌కు చేయవలసిన మరమ్మతులు పూర్తి చెయ్యడంతో వాహనం మళ్లీ సీఎం దగ్గరకు చేరుకుంది. జరిగిన ఘటన వల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


