breaking news
jamar vehicle
-
సీఎం రేవంత్ కాన్వాయ్‌కు తృటిలో తప్పిన పెనుప్రమాదం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ జామర్ కారుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఎగ్జిట్ 17 వద్ద రన్నింగ్ లోనే సీఎం కాన్వాయ్ జామార్ టైర్ పగిలింది. జామార్ కుడి వైపు ఉన్న వెనుక టైర్ అకస్మాత్తుగా పగిలిపోవడంతో వాహనాన్ని డ్రైవర్ చాకచక్యంగా కంట్రోల్ చేశాడు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ టీమ్ వెంటనే స్పందించి స్టెప్నీ టైర్ మార్చారు. జామార్కు చేయవలసిన మరమ్మతులు పూర్తి చెయ్యడంతో వాహనం మళ్లీ సీఎం దగ్గరకు చేరుకుంది. జరిగిన ఘటన వల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
జామర్ వాహనాన్ని ఢీకొట్టిన రైలు
హిందూపురం: ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బందోబస్తు కోసం తెచ్చిన జామర్ వాహనాన్ని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. కారు పూర్తిగా దెబ్బతింది.గుడ్డం సమీపంలో ఉన్న కాపలాలేని రైల్వేగేటు వద్ద జామర్ కారును కాచిగూడ-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. రాహుల్ గాంధీ ఈ రోజు అనంతపురం జిల్లా హిందూపురంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. హిందూపురం ఎంజీఎం మైదానంలో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. రాహుల్ వస్తున్న సందర్భంగా బందోబస్తు నిమిత్తం సెల్‌ఫోన్ జామర్ కారును తీసుకువచ్చారు. రైల్వేగేటు సమీపంలో పరీక్షించే నిమిత్తం కారు అక్కడకు వెళ్లింది. రైలు పట్టాలు దాటేసమయంలో రైలు వేగంగా వచ్చి దానిని ఢీకొట్టింది.కారు పల్టీలు కొట్టి రైల్వేగేటుకు అమర్చిన ఇనుప స్థంభాలకు ఢీకొట్టింది. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది.


