జామర్ వాహనాన్ని ఢీకొట్టిన రైలు | Train accident to jamar vehicle | Sakshi
Sakshi News home page

జామర్ వాహనాన్ని ఢీకొట్టిన రైలు

Apr 30 2014 5:50 PM | Updated on Aug 14 2018 4:24 PM

ప్రమాదానికి గురైన కారు - Sakshi

ప్రమాదానికి గురైన కారు

ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బందోబస్తు కోసం తెచ్చిన జామర్ వాహనాన్ని రైలు ఢీకొట్టింది.

హిందూపురం: ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బందోబస్తు కోసం తెచ్చిన   జామర్ వాహనాన్ని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్కు స్వల్పంగా గాయాలయ్యాయి. కారు పూర్తిగా దెబ్బతింది.గుడ్డం సమీపంలో ఉన్న కాపలాలేని రైల్వేగేటు వద్ద జామర్ కారును కాచిగూడ-యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది.

 రాహుల్ గాంధీ ఈ రోజు అనంతపురం జిల్లా హిందూపురంలో పర్యటించనున్న విషయం తెలిసిందే.  హిందూపురం ఎంజీఎం మైదానంలో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. రాహుల్ వస్తున్న సందర్భంగా బందోబస్తు నిమిత్తం సెల్ఫోన్ జామర్ కారును తీసుకువచ్చారు. రైల్వేగేటు సమీపంలో పరీక్షించే నిమిత్తం కారు అక్కడకు వెళ్లింది. రైలు పట్టాలు దాటేసమయంలో రైలు వేగంగా వచ్చి దానిని ఢీకొట్టింది.కారు పల్టీలు కొట్టి రైల్వేగేటుకు అమర్చిన ఇనుప స్థంభాలకు ఢీకొట్టింది. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement