ఎదురెదురుగా వచ్చిన రెండు ఖాళీ రైళ్లు ఢీ | Train Collision in Bhubaneswar | Sakshi
Sakshi News home page

ఎదురెదురుగా వచ్చిన రెండు ఖాళీ రైళ్లు ఢీ

Jun 12 2026 5:18 AM | Updated on Jun 12 2026 5:18 AM

Train Collision in Bhubaneswar

ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన రైళ్లు

ఒకే ట్రాక్‌పైకి రైళ్లను అనుమతించడంపై చర్చ  

భువనేశ్వర్‌: తూర్పు కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయ స్టేషన్‌ భువనేశ్వర్‌లో గురువారం రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. శుభ్రత పనుల నిర్వహణలో భాగంగా ఖాళీ రైళ్లను ఒకే ట్రాక్‌పై నడిపించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఖాళీ రైళ్లు కావడంతో ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదు. 

లోకో పైలెట్లు క్షేమంగానే ఉన్నారు. రైళ్ల రాకపోకల్లో ఎలాంటి మార్పులూ చోటు చేసుకోలేదు. ఝరపడా వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే  రైల్వే యంత్రాంగం ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగే శుభ్రత కార్యకలాపాల్లో ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లను ఎలా అనుమతించరనేది చర్చనీయాంశమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement