15 మంది మృతి.. 88 మందికి గాయాలు
జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తా సమీపంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. బెకాసి తైమూర్ స్టేషన్‌లో సోమవారం ఆగి ఉన్న ప్రయాణికుల రైలు వెనుక బోగీని మరో రైలు ఢీకొట్టింది. బోగీలో ఉన్న ప్రయాణికుల్లో 15 మంది మరణించారు.
వారంతా మహిళలే కావడం గమనార్హం. ఈ బోగీని కేవలం మహిళల కోసమే కేటాయించారు. రైలు ప్రమాదంలో మరో 88 మంది గాయపడ్డారు. చికిత్స కోసం వారందరినీ ఆసుపత్రికి తరలించారు.


