ఎదురెదురుగా దూసుకొచ్చిన రైళ్లు.. | Two Trains on Same Track Near Bhubaneswar | Sakshi
Sakshi News home page

ఎదురెదురుగా దూసుకొచ్చిన రైళ్లు..

Jun 11 2026 5:57 PM | Updated on Jun 11 2026 6:32 PM

Two Trains on Same Track Near Bhubaneswar

భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్ సమీపంలో భారీ రైలు ప్రమాదం తప్పింది. భువనేశ్వర్‌ సమీపంలోని జార్పడా బ్రిడ్జి దగ్గర ఇవాళ (గురువారం) రెండు ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఒకే ట్రాక్‌పైకి రావడం కలకలం రేపింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదాన్ని నివారించగలిగారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. భువనేశ్వర్ నుంచి మంచేశ్వర్ వైపు వెళ్తున్నఓ రైలు.. ఎదురుగా వస్తున్న మరో రైలు ఒకే ట్రాక్‌పైకి చేరాయి. ఈ విషయాన్ని సకాలంలో గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై రెండు రైళ్లను సురక్షితంగా నిలిపివేశారు. ఈ ఘటన భువనేశ్వర్‌లోని అత్యంత రద్దీగా ఉండే జార్పడా వంతెన మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై తూర్పు తీర రైల్వే (ఈసీఓఆర్) అధికారులు విచారణ ప్రారంభించారు. ట్రాక్ కేటాయింపులో జరిగిన పొరపాటు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement