ప్రతిదానికీ సైన్స్ ఒక లెక్క వేస్తుంది.. కానీ ఆ లెక్కలు తప్పే చోట, లాజిక్‌కు అందని ఒక మ్యాజిక్ మొదలవుతుంది. దాన్నే మనం దైవికశక్తి అంటాం. ఒడిశాలోని దట్టమైన అడవుల మధ్య ఉన్న గుప్తేశ్వర్ గుహలు కూడా ఆ కోవలోకే వస్తాయి..! ఏటా పరిమాణం పెరుగుతూ, సైన్స్‌కే సవాల్ విసురుతున్న ఒక జీవమున్న శివలింగం కథ ఇది..! ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పేరు చెబితేనే.. దట్టమైన అడవులు, కొండలు గుర్తుకువస్తాయి. వాటి మధ్య ప్రకృతి మలచిన సున్నపురాయి గుహలు ఉన్నాయి.
అక్కడికి వెళ్తే మనకు కనిపించేది ఒక అద్భుతం ఏంటంటే.. ఏటా పెరిగే శివలింగం..! ఇక ఈ గుహల లోపల ఉండే వాతావరణం కూడా ఓ పెద్ద వింత. బయట ఎంత ఎండగా ఉన్నా, గుహ లోపలికి అడుగుపెట్టగానే ఏసీ ఆన్ చేసినట్లు చల్లగా మారిపోతుంది. అంతేకాదు, అక్కడ ఉండే ఎకో సిస్టమ్ అంటే.. ప్రతిధ్వని చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు అక్కడ నిలబడి ఒక్కసారి 'ఓం నమఃశివాయ' అని పంచాక్షరీ మంత్రాన్ని ఉచ్ఛరిస్తే.. ఆ ధ్వని తరంగాలు గుహ గోడలకు తగిలి వచ్చే ప్రతిధ్వని, మన శరీరంలో ఒక తెలియని దైవిక ప్రకంపనలను, ప్రశాంతతను తీసుకువస్తుంది. ఏటా పెరుగుతున్న శివలింగానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో మిస్ కాకుండా చూడండి..


