సాక్షి, నల్గొండ: హైదరాబాద్ -విజయవాడ నేషనల్ హైవేపై సినిమాస్టంట్‌ను తలపించే యాక్సిడెంట్ జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన కార్లు ఒకదానికొకటి వరుసగా మూడుకార్లు ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ కారు అక్కడ హైవే నెంబర్ 65 వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో దాని వెనుక వచ్చిన రెండు కార్లు వెనువెంటనే ఢీకొన్నాయి. దీంతో అందులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. యాక్సిడెంట్‌తో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.
మరోవైపు సంక్రాంతి సెలవులు ముగియడంతో పండగకు హైదరాబాద్ నుంచి ఊరెళ్లిన ప్రజలు తిరుగుప్రయాణమయ్యారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.


