పడవ బోల్తా పడి ఇద్దరు మృతి.. ఐదుగురు గల్లంతు | Patna Tragedy Boat Capsizes in Swollen Ganga, 2 Dead and 5 Missing | Sakshi
Sakshi News home page

పడవ బోల్తా పడి ఇద్దరు మృతి.. ఐదుగురు గల్లంతు

May 28 2026 9:43 AM | Updated on May 28 2026 9:43 AM

Patna Tragedy Boat Capsizes in Swollen Ganga, 2 Dead and 5 Missing

పట్నా: బిహార్‌లోని పట్నాలో గంగా నది ఉగ్రరూపం దాల్చింది. వరద నీటి ప్రవాహానికి 14 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ  తప్పి బోల్తా పడటంతో పెను విషాదం నెలకొంది. గురువారం (నేడు) జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు.

పట్నా ప్రాంతంలో గంగా నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో పెరగడంతో నదిలో ఉధృతమైన ప్రవాహం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో 14 మందిని ఎక్కించుకుని వెళ్తున్న పడవ నది మధ్యలోకి వెళ్లగానే ఒక్కసారిగా బోల్తా పడింది.  ప్రాణభయంతో ప్రయాణికులు కేకలు వేయగా, సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
 

సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఎమర్జెన్సీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ఏడుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వరద ఉధృతి, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎస్డీఆర్ఎఫ్  బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. ఈ ప్రమాదంలో మరణించిన ఇద్దరి మృతదేహాలను సహాయక సిబ్బంది నది నుంచి వెలికితీశారు. వారి గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. గల్లంతైన ఐదుగురి కోసం నదిలోని వివిధ ప్రాంతాల్లో గాలింపును వేగవంతం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement