లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. మథుర, బృందావన్ లోని యమునా నది కెశీఘాట్ ఘాట్ సమీపంలో పడవ నీటమునిగి 12 మంది భక్తులు దుర్మరణం చెందారు. 32 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ పాంటూన్ బ్రిడ్జిని ఢీకొట్టి నీట మునిగింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న పర్యాటకులంతా నీటిలో గల్లంతయ్యారు.
దీంతో వివరాలు తెలుసుకున్న NDRF సిబ్బంది గజ ఈతగాళ్లతో వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. కాగా బాధితులలో ఇప్పటివరకూ 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే గల్లంతవారయినంతా పంజాబ్‌లోని ముక్త్సర్‌కు చెందిన భక్తుల బృందంగా సమాచారం.


