రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం | serious accident has occurred in Rangareddy district | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం

Apr 27 2026 6:18 PM | Updated on Apr 27 2026 7:02 PM

serious accident has occurred in Rangareddy district

సాక్షి,హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. క్రేన్‌ కింద పడి ముగ్గురు కార్మికులు మరణించారు. 

పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. శంకర్‌ పల్లి మండలం, మహాలింగాపురంలో ఎన్‌సీసీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఘటన చోటు చేసుకుంది. భారీ ఈదురు గాలులకు క్రేన్‌ కింద పడింది. క్రేన్‌ కిందపడి ముగ్గురు కార్మికులు మరణించారు. పదిమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడిన క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement