ఆసుపత్రి బెడ్‌పై నుంచే పండు మాస్టర్ వీడియో | Pandu Master Health Update Latest | Sakshi
Sakshi News home page

Pandu Master: యాక్సిడెంట్ ఎలా జరిగిందో చెప్పిన పండు మాస్టర్

Jun 5 2026 12:43 PM | Updated on Jun 5 2026 12:50 PM

Pandu Master Health Update Latest

తెలుగులో డ్యాన్స్ షోలతో గుర్తింపు తెచ్చుకున్న పండు మాస్టర్.. రీసెంట్‌గా వైజాగ్‌లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతానికి పండు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆస్పత్రి బెడ్‌పై నుంచే వీడియో రిలీజ్ చేశాడు. యాక్సిడెంట్ ఎలా జరిగింది? తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వెల్లడించాడు.

(ఇదీ చదవండి: మొన్న 'దేవర'.. ఇప్పుడు 'పెద్ది'.. జాన్వీ కపూర్‌ అదే తంతు)

'తగరపువలసలో ఈవెంట్ చేసుకుని బయలుదేరాం. కారులో వస్తుండగా నాకు వాంతి వస్తున్నట్లు అనిపించింది. దీంతో ఆనందపురం దాటిన తర్వాత ఓ చోట ఆగాను. బయటకు దిగి కారు ముందుకెళ్లి వాంతి చేస్తుండగా కోళ్ల ఫారమ్ వ్యాన్ వచ్చి మా కారుని బలంగా ఢీ కొట్టింది. అప్పుడు మా కారు నాపై ఎక్కడంతో నా రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. అప్పుడు నేను అపస్మాకర స్థితిలో ఉండటంతో ఏం జరిగిందో తెలీదు' అని ఈ వీడియోలో పండు చెప్పాడు. అయితే ఈ ప్రమాదానికి కోళ్ల వ్యాన్ డ్రైవర్ అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

వైద్యులు చెప్పిన దాని ప్రకారం.. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ నడుము కింది భాగంలో జాయింట్ కదిలిపోయింది. శస్త్రచికిత్స ద్వారా దాన్ని సరిచేశారు. రెండు కాళ్లకు కూడా సర్జరీలు చేసినట్లు తెలుస్తోంది. కనీసం ఆరు నెలల విశ్రాంతి అవసరమని, తర్వాత మళ్లీ యధావిధిగా డ్యాన్స్ చేయవచ్చని వైద్య బృందం స్పష్టం చేశారు.

(ఇదీ చదవండి: 'జన నాయగణ్'.. డబ్బులు తిరిగిచ్చేస్తున్న నిర్మాత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement