హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈయన చివరి సినిమాకు మోక్షం కలగట్లేదు. 'జన నాయగణ్' ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. ఈ నెల 19న థియేటర్లలో విడుదల పక్కా అని రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ టాక్.
(ఇదీ చదవండి: 'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?)
తెలుగు సినిమా 'భగవంత్ కేసరి'కి రీమేక్ అయిన 'జన నాయగణ్'.. లెక్క ప్రకారం ఈ ఏడాది జనవరి 9నే రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ సమస్యల కారణంగా అప్పటినుంచి అలా ఉండిపోయింది. మధ్యలో నిర్మాతలు కోర్టుకెళ్లారు. తమిళనాడు ఎన్నికలు జరిగాయి. మూవీ కూడా లీక్ అయింది. విజయ్ ముఖ్యమంత్రి కావడంతోనే ఇక సినిమా సాఫీగా రిలీజ్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ సమస్యలు తప్పట్లేదు.
ఇప్పటికే నాన్ థియేట్రికల్ డీల్స్ రద్దవగా.. తాజాగా థియేట్రికల్ అగ్రిమెంట్స్ కూడా రద్దు చేసుకుని.. డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్స్ తిరిగిచ్చేయమని నిర్మాతకు హీరో విజయ్ సూచించారట. రిలీజ్ డేట్ ఖరారైన తర్వాత సొంతంగా రిలీజ్ చేసుకోమని నిర్మాతకు సలహా ఇచ్చారట. ఇప్పుడీ విషయం అంతటా చర్చనీయాంశంగా మారిపోయింది. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. అనిరుధ్ పాటలు ఇప్పటికే ఆకట్టుకున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్.. ఈసారి ఇంకాస్త)


