‘కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు’.. ట్రంప్‌ పరువు తీసిన ఇరాన్‌ | Trump, Look Them in the Eyes: Iran Slams Trump Over Minab Elementary School Tragedy | Sakshi
Sakshi News home page

‘కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు’.. ట్రంప్‌ పరువు తీసిన ఇరాన్‌

Mar 9 2026 8:12 PM | Updated on Mar 9 2026 8:16 PM

Trump, Look Them in the Eyes: Iran Slams Trump Over Minab Elementary School Tragedy

టెహ్రాన్‌: ‘ట్రంప్‌ కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు’ అంటూ ఇరాన్‌ ప్రభుత్వ ఆంగ్ల మీడియా సంస్థ టెహ్రాన్‌ టైమ్స్ ఫ్రంట్‌ పేజీలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో ఇటీవల అమెరికా మిసైల్‌ దాడిలో మరణించిన ఇరాన్‌ మినాబ్ నగరంలోని ఎలిమెంటరీ స్కూల్‌ విద్యార్థుల ఫొటోలు ప్రచురించి, ప్రపంచ దేశాల ఎదుట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరువు తీసింది.

‘ట్రంప్‌ ఒక్కసారి ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు’ అంటూ ఆ ఫొటోలతో పాటు ఇరాన్‌పై జరుగుతున్న సైనిక దాడులపై ట్రంప్‌ చేసిన ప్రకటనలు బాధ్యతారహితంగా, తప్పుడు వాదనలు, దౌత్య పరిష్కారాలను ధిక్కరించేవిగా ఉన్నాయని పేర్కొంది. స్కూల్‌పై దాడి ఘటనపై ట్రంప్‌ మాట్లాడుతూ, “ఆ స్కూల్‌పై ఇరాన్‌ దాడి చేసింది. వారి ఆయుధాలకు ఖచ్చితత్వం ఉండదు” అంటూ ఇనాబ్‌ స్కూల్‌ విషాదాన్ని ఇరాన్‌పై నెట్టే ప్రయత్నం చేశాడు.

ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఇరాన్‌ తన సొంత మీడియా పత్రిక ఫ్రంట్‌ పేజీలో ఇనాబ్‌ స్కూల్‌లో ప్రాణాలు కోల్పోయిన పసిపిల్లల ఫొటోలు అచ్చు వేసింది. ఇక అటు ట్రంప్‌, ఇటు ఇరాన్‌ వాదనలు–ప్రతివాదనలు కొనసాగుతుండగా, ప్రముఖ అమెరికా మీడియా సంస్థ న్యూయార్క్‌ టైమ్స్ విచారణలో మినాబ్‌లోని పాఠశాలపై దాడి చేసింది అమెరికా సైన్యమేనని తేలింది. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ సంయుక్త దాడి జరగగా, స్కూల్‌లో 150 మంది చనిపోయారని, వారిలో అధిక శాతం విద్యార్థులేనని నివేదికలో పేర్కొంది. స్కూల్‌లో జరిగిన మారణహోమానికి అమెరికా, ఇజ్రాయెల్‌ బాధ్యత వహించాల్సిందేనని న్యూయార్క్‌ టైమ్స్ హైలైట్‌ చేసింది.



గత ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని ఇనాబ్‌ ప్రాంతంలో అమెరికా–ఇజ్రాయెల్‌ మిసైళ్లతో దాడి జరిపాయి. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC) స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా అభివృద్ధి చేసిన టొమాహాక్ క్రూయిజ్ మిసైల్ దాడి జరిగినట్లు యుద్ధాలు, ఘర్షణలు, వాటి ప్రభావాలను అధ్యయనం చేసే రీసెర్చర్‌ ట్రెవర్ బాల్ తెలిపారు.

అంతేకాదు, తొలిసారి ఐఆర్‌జీసీ కేంద్రాలపై అమెరికానే ఈ దాడి జరిపిందని, అందులో ఇజ్రాయెల్‌ ప్రమేయం లేదని చెప్పారు. ఇనాబ్‌ స్కూల్‌ గోడలోకి దూసుకెళ్లిన అమెరికాకు చెందిన టొమాహాక్ క్రూయిజ్ మిసైల్ అని నిర్ధారించేందుకు ఫుటేజీలను కూడా బయటపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement