పతనమైన వెండి.. రూ.35 వేలు తగ్గిన రేటు! | Silver Prices Drop In 7 Days In India, KG Rates Fall By ₹35,000 In A Week, Check Out Latest Rates Inside | Sakshi
Sakshi News home page

Silver Prices In India: పతనమైన వెండి.. రూ.35 వేలు తగ్గిన రేటు!

Mar 8 2026 3:03 PM | Updated on Mar 8 2026 4:59 PM

Silver Prices Drop in 7 Days in India Check Latest Rates

భారతదేశంలో బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో కేజీ సిల్వర్ రేటు వారం రోజుల్లో సుమారు రూ. 35వేలు తగ్గింది. ఈ కథనంలో లేటెస్ట్ సిల్వర్ ధరల గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

మార్చి 1న రూ.3.25 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు మార్చి 7 నాటికి రూ.2.90 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.35వేలు తగ్గిందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే రేట్లు కొనసాగుతున్నప్పటికీ.. ప్రస్తుతం దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.85 లక్షల దగ్గర ఉంది. దీన్నిబట్టి చూస్తే దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగా ఉందని తెలుస్తోంది.

ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్నవేళ బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయనుకుంటే.. మెల్లగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ తగ్గుదల కేవలం తాత్కాలికం మాత్రమే. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు తప్పకుండా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

(Disclaimer: పైన పేర్కొన్న వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement