కడప సెవెన్‌రోడ్స్: గ్యాస్ సరఫరాపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మవద్దని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని, జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీఎస్‌ఓ రఘురామ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లోలోని 58 గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. అలాగే సంభందిత డివిజనల్ అధికారులను పర్యవేక్షణాధికారులుగా నియమించమన్నారు.
జిల్లా, డివిజనల్ స్థాయిలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అసత్య ప్రచారాలు నమ్మి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఎల్‌పీజీ నిల్వలు అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు చేపడుతామని తెలిపారు. జిల్లాలో గృహ అవసరాల వినియోగ గ్యాస్ కొరత ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉండదన్నారు. గ్యాస్ కంపెనీల ద్వారా సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్ కొరత వస్తుందనే ఉద్దేశంతో వెంట వెంటనే ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ చేయడానికి వెబ్ పోర్టల్ అనుమతించదని కేవలం 25/45 రోజులు (పట్టణ/గ్రామీణ వినియోగదారులు) గడువులో మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు. గృహ అవసరాలు, సంక్షేమ వసతి గృహాలు, ఇతర అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరాలో నిలుపుదల ఉండదని స్పష్టం చేశారు. అవసరానికి మించి గ్యాస్ సిలిండర్ల ను నిల్వ చేయడం లేదా కొనుగోలు చేయడం చేయరాదన్నారు. ప్రభుత్వం మరియు జిల్లా పాలన యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నాయన్నారు. ప్రజలు అపోహలను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలన్నారు.గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్యఅవసరాల కోసం తరలించిన/ వినియోగించిన అట్టి వారిపై నిత్యావసరాల చట్టం 1955, ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సమస్యలకు సంప్రదించాల్సిన నెంబర్లు
జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా


