ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి | - | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి

Mar 16 2026 7:38 AM | Updated on Mar 16 2026 7:38 AM

కడప అర్బన్‌ : ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్‌.పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ హెచ్చరించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 262 కేసులు నమోదు చేసి, రూ.53,145 జరిమానా విధించినట్లు తెలిపారు. కార్లలో వెళ్లే వారు సీట్‌ బెల్ట్‌ ధరించాలన్నారు. రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బైక్‌లు ఢీ: ఒకరు మృతి

పుంగనూరు : మండలంలోని భీమగానిపల్లె సమీపంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయుల విగ్రహం కూడలిలో ఆదివారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. పట్రపల్లెకి చెందిన సుబ్బిరెడ్డి(65) పుంగనూరుకు సొంత పనులపై బైక్‌లో వస్తుండగా, పుంగనూరు నుంచి మదనపల్లెకు ద్విచక్రవాహనంలో వెళ్తున్న ఎన్‌ఎస్‌.పేటకు చెందిన నజీర్‌(35 ) నదీమ్‌ (30) భీమగానిపల్లె సర్కిల్‌ వద్దకు రాగానే ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో సుబ్బిరెడ్డి అక్కడేక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని స్థానికులు 108లో ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. ఈ మేరకు పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మేసీ్త్ర అదృశ్యంపై కేసు నమోదు

మదనపల్లెటౌన్‌ : మదనపల్లెలో మేసీ్త్ర అదృశ్యంపై పోలీసులు కేసు నమోదుచేశారు. టూటౌన్‌ పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఎస్‌బీఐ కాలనీలో నివాసం ఉంటున్న మారెప్ప కుమారుడు ఎస్‌.సోమశేఖర్‌ (34), మేసీ్త్ర పనులు చేసేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంటి నుండి పనుల నిమిత్తం వెళ్లిన సోమశేఖర్‌ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పలుచోట్ల గాలించారు.ఆచూకీ లభించక పోవడంతో చేసేది లేక సోమశేఖర్‌ భార్య సోను టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు.

జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య

లక్కిరెడ్డిపల్లి : జీవితంపై విరక్తి చెంది వంటేరు ప్రసాదు (26) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ గోల్గొండ శోభ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కస్తూరురాజుగారిపల్లికి చెందిన వంటేరు వ్రసాద్‌ భార్య మూడేళ్ల క్రితం మృతి చెందింది. దీంతో అప్పట్లో మృతుడిపై కేసు నమోదైంది. ఈ కేసుపై కొన్ని రోజులుగా కోర్టుకు వాయిదాలు తిరుగుతున్నాడు. గురువారం లక్కిరెడ్డిపల్లి కోర్టుకు వాయిదాకు వెళ్లి పందేళపల్లి సమీపంలోని వెలిగల్లు ప్రాజెక్టు కాలువలో విషద్రావణం తాగి శుక్రవారం మృతి చెందాడు. ఆదివారం ఉదయం పశువుల కాపరులు ఆ మార్గంలో వెళ్తుండగా వెలిగల్లు ప్రాజెక్టు కాలువలో మృతదేహం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు, దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement