రాజంపేట : ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ బూత్ కమిటీలే క్రీయాశీలకమని పోలింగ్ బూత్ కమిటీల రాష్ట్ర అధ్యక్షుడు కె.సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అధ్యక్షతన ఆకేపాటి ఎస్టేట్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన పార్లమెంటరీ స్ధాయి బూత్‌స్ధాయి సమావేశం ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలంటే పోలింగ్ బూత్ కమిటీలు పక్బండందీగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. త్వరలో ఎస్‌ఐఆర్ సర్వే జరగనున్నదన్నారు. ఈ సర్వేలో పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్లను కోల్పోకుండా చూడాలన్నారు. అందుసంబంధించి ధృవపత్రాలను జతపరిచి, వాటిని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన పరిస్ధితులను కల్పించుకోవాలన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, టీడీపీ ఎత్తుగడలను తిప్పికొడుతూ, ముందుస్తుగా ఓట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్ధితులు నేడున్నాయన్నారు. పోలింగ్ బూత్ ఏజెంట్ల నియామకంపై కూడా ఇప్పటి నుంచి దృష్టి సారించాలని తెలిపారు.ఎన్నికలసంఘం నియమనిబంధనలను అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాఽథరెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో బలోపేతంగా పనిచేసినప్పుడే ఎన్నికల ప్రక్రియలో మంచి ఫలితాలు చూడగలమన్నారు. పోలింగ్‌బూత్ నియమాకానికి సంబంధించిన అంశాలపై పకడ్బందీగా ముందుకెళ్లాలన్నారు. ప్రతి ఓటు కీలకమనేది గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాలంటే ఇప్పటినుంచే గ్రామ, మండల, నియోకవర్గస్థాయి వరకు కమిటీలో ఉన్న వారు చురుగ్గా పనిచేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ స్ధానిక సంస్ధల ఎన్నికలకు పార్టీ క్యాడర్ సిద్ధంకావాలన్నారు. టీడీపీని ఓడించేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు. ఐదు సంవత్సరాలు తర్వాత వచ్చే ఎన్నికలప్రక్రియ కీలకమైందన్నారు. రైల్వేకోడూరు మాజీ శాసనసభ్యుడు కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ కలిసికట్టుగా పార్టీ బలోపేతం కోసం కృషిచేద్దామన్నారు. పోలింగ్‌బూత్ కమిటీలు, గ్రామస్థాయి కమిటీలే ఎన్నికల ప్రక్రియలో కీలకభూమి పోషిస్తాయన్నారు. పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న వారంతా పార్టీని బలోపేతం చేసుకోవాలని తెలిపారు. పోలింగ్‌బూత్ స్ధాయి వర్క్‌షాపులో రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి చెప్పేసూచనలు, సలహాలు పాటించేలా ముందుకెళ్లాలన్నారు. పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబులరెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు కావాల్సింది కార్యకర్తలకు భరోసా ఇవ్వడమే అని అన్నారు. వారిలో మనోధైర్యం నింపే బాధ్యత నియోజకవర్గ స్థాయి నేతలు తీసుకోవాలన్నారు. కేసులకు భయపడే ప్రసక్తిలేదని, తిరిగి వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తెచ్చుకోవాలన్నారు. రాయలసీమ జోన్ బూత్ కమిటి కన్వీనరు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, జిల్లా బూత్‌కమిటీ అధ్యక్షుడు నడివీధి సుధాకర్‌లు ప్రసంగించారు. కార్యక్రమంలో రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, ఎస్‌ఈసీ సభ్యుడు చొప్పా ఎల్లారెడ్డి, మండలపార్టీ కన్వీనర్ గోపిరెడ్డి, దొడ్డిపల్లె భాస్కర్‌రాజు, రామస్వామిరెడ్డి, టక్కోలు శివారెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దండుగోపి, నియోజకవర్గ బూత్ కన్వీనర్లు రెడ్డి హరి, సూరం సుబ్బారెడ్డి, రవికుమార్‌రెడ్డి, తిప్పన నాగభూషణం, డీలర్ సుబ్బరామిరెడ్డి, పోలి రఘు, సుబ్బరామిరెడ్డి, భాస్కర్‌యాదవ్, కిషోర్‌కుమార్, బూత్ కమిటీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రెహిమాన్‌ఖాన్, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, బూత్‌కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.
బూత్‌కమిటీల రాష్ట్ర అధ్యక్షుడు కె.సుధాకర్‌రెడ్డి


