కొండాపురం: గండికోట జలాశయం నుంచి కుప్పానికి తాగునీరు అందించేందుకు రూ.2,370 కోట్లతో పనులు చేపట్టినట్లు ఇరిగేషన్ సీఈ రవికుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ప్రసన్న కుమార్ తెలిపారు. మంగళవారం గండికోట జలాశయం వద్ద జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. జల్ జీవన్ పథకంలో భాగంగా రెండు విడతల్లో కుప్పానికి తాగునీరు తీసుకెళ్లేందుకు పనులు చేపట్టామన్నారు. మొదటి దశలో మదనపల్లె పీలేరు తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీరు అందుతుందన్నారు. జలాశయం వద్ద ఇంటెల్ వెల్ నిర్మాణంతో పాటు పైపులైను నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈఓ ఉమా మహేశ్వర్లు జ్ఞానేందర్ రెడ్డి సుదర్శన్, విద్య తదితరులు పాల్గొన్నారు.


