20 సిలిండర్ల స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

20 సిలిండర్ల స్వాధీనం

Mar 14 2026 7:48 AM | Updated on Mar 14 2026 7:48 AM

20 సిలిండర్ల స్వాధీనం కరెంటు షాక్‌తో యువకుడికి గాయాలు

గోపవరం : మండల రెవెన్యూ పరిధిలో నిర్వహించే వివిధ హోటళ్లలో గృహావసరాలకు ఉపయోగించే 20 సిలిండర్లను రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఆర్డీఓ చంద్రమోహన్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. వాణిజ్య సిలిండర్లకు బదులుగా గృహావసరాల సిలిండర్లను ఉపయోగిస్తుండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. గృహావసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను బ్లాక్‌లో హోటళ్లకు సరఫరా చేస్తే సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకోనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా వాణిజ్య సిలిండర్ల కొరత అధికంగా ఉండటంతో హోటల్‌ యజమానులు గృహావసరాలకు ఉపయోగించే సిలిండర్లను బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.

మదనపల్లె టౌన్‌ : కరెంటు షాక్‌ కొట్టి ఉత్తరప్రదేశ్‌ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన గురువారం రాత్రి మదనపల్లెలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పలువురు యువకులను స్థానిక నీరుగట్టువారిపల్లెకు చెందిన రాము ఇటీవల కూలీ పనులు చేయించుకోవడానికి తీసుకు వచ్చాడు. వారితో రింగు రోడ్డు వద్ద ఓ భవనానికి పీఓపీ పనులు చేస్తుండగా తస్లీం(19)కరెంటు షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని సహచరులు స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తిరుపతి రుయాకు రెఫర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement