పాలిటెక్నిక్‌ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు

Mar 19 2026 7:44 AM | Updated on Mar 19 2026 7:44 AM

ప్రొద్దుటూరు కల్చరల్‌: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ పాలెం గురుమూర్తి రెడ్డి బుధవారం తెలిపారు. కళాశాలలో నిర్వహిస్తున్న డిప్లొమా కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, డిప్లొమా ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ కోర్సులకు న్యూఢిల్లీ నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) సంస్థ నుంచి గుర్తింపు లభించిందన్నారు. ఎన్‌బీఏ నిపుణుల బృందం ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కళాశాలను సందర్శించి, విద్యాప్రమాణాలు, మౌలిక సదుపాయాలు వంటి వాటిని సమగ్రంగా పరిశీలించినట్లు చెప్పారు. అనంతరం కంప్యూ టర్‌ ఇంజనీరింగ్‌, డిప్లొమా ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ కోర్సులకు 2026 జనవరి 1 నుంచి 2028 డిసెంబర్‌ 31 వరకు అక్రిడిటేషన్‌ మంజూరు చేసినట్లు ఎన్‌బీఏ ప్రకటించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement