జూనియర్‌ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలి

Mar 19 2026 7:44 AM | Updated on Mar 19 2026 7:44 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : ఇరిగేషన్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రణీత్‌రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఇంజినీర్ల సంఘం బుధవారం ఇరిగేషన్‌ శాఖ ఎస్‌ఈకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. మంగళవారం సాయంత్రం స్థానిక ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ ఎదురుగా ఉన్న ఇరిగేషన్‌ కార్యాలయంలో బద్వేలు డీఈ వేణుగోపాల్‌రెడ్డి అక్కడే పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ ప్రణీత్‌రెడ్డిల మధ్య పనుల విషయంగా ఘర్షణ జరిగింది. ఈ మేరకు ఇరువురు పోలీసుస్టేషన్‌లో కూడా ఫిర్యాదులు చేసుకున్నారు. బుధవారం డీఈ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి ఇంజినీర్ల సంఘం ప్రతినిధులు ఎస్‌ఈ అబ్దుస్‌ షమీని కలిసి జరిగిన సంఘటన గురించి తెలియజేసి అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అక్కడ జరిగిన విషయం తమకు ఎలా తెలుస్తుందని, వెంటనే ఇక్కడికి ఈఈ చెంగల్రాయుని రమ్మని చెప్పాలని ఇంజినీర్లకు ఆయన తెలియజేశారు. దాదాపు గంటసేపు ఇంజినీర్ల సంఘం ప్రతినిధులు ఎస్‌ఈ కార్యాలయంలోనే ఉండి ఈఈ వచ్చిన తర్వాత కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పదేపదే చెప్పారు. ఈ విషయమై ఎస్‌ఈ అబ్దుల్‌ షమి ఈఈ చెంగల్రాయుడిపై సీరియస్‌ అయ్యారు. బాధ్యతాయుతమైన ఉద్యోగులు కార్యాలయంలోనే ఘర్షణకు దిగుతుంటే ఏం చేస్తున్నారని, ఘర్షణకు తావివ్వకుండా ముందే విషయాన్ని ఇంతవరకు రానీయకుండా చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఈఈ చెంగ్రలాయులుకు ఎస్‌ఈ మెమో ఇచ్చారు. ఈ సంఘటనపై పూర్తిగా విచారణ చేపట్టి తమకు నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని సూచించారు. అందుకు సంబంధించి మెమోను కూడా ఇచ్చినట్లు ఎస్‌ఈ వివరించారు. నివేదిక ప్రకారం ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి.

ఈఈకి మెమో ఇచ్చిన ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement