● రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం
● సమస్యాత్మక కేంద్రంలో
సీసీ కెమెరాలు ఏర్పాటు
● విలేకర్ల సమావేశంలో
డీఈఓ షేక్ షంషుద్దీన్
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదోతరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం డీఈఓ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో 28,152 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను రాస్తున్నట్లు తెలిపారు. వారి కోసం జిల్లాలో 167 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని వెల్లడించారు. 7 ఫ్లయింగ్ స్క్వాడ్, 30 సిట్టింగ్ స్క్వాడ్‌లను సిద్ధం చేశామని తెలిపారు. జిల్లాలో 9 సమ స్యాత్మక కేంద్రాలను గుర్తించామని వాటిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. అలాగే మిగతా పరీక్షా కేంద్రాలలో కూడా ఎక్కడ సమస్యలను లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పరీక్షా కేంద్రాలలో నిరంతరం విద్యుత్తుతోపాటు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్ల లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షకు హాజ రయ్యే విద్యార్థులు నిర్ణీత సమయానికే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈ ఏడాది పరీ క్షా కేంద్రాల్లో వాటర్ బాయిస్ ఉండరని పరీక్షా కేంద్రాల్లోకి వాటర్ బాటిళ్లను కూడా అనుమతి లేదని వివరించారు. విద్యార్థులకు దాహం వేస్తే పరీక్ష గది ముందు ఏర్పాటు చేసిన చోటికు వచ్చి మంచినీటిని తాగవచ్చని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో ఎవరైనా కోడ్ ఆప్ కాంట్రాక్టు అతిక్రమిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాలలో ఏవైనా సమస్యలుంటే డీఈఓ కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9121846205 ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జిల్లాలో పది పరీక్ష పర్యవేక్షణకు రాష్ట్ర అబ్జర్వర్‌గా టెక్స్‌బుక్స్ డైరెక్టర్ మధుసూదన్‌రావును ప్రభుత్వం ఏర్పాటు చేసిందని డీఈఓ తెలిపారు.
ఓపెన్ స్కూల్ పది పరీక్షల కోసం....
ఓపెన్ స్కూల్ పది పరీక్షల కోసం కూడా జిల్లాలో 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 2424 మంది విద్యార్థులు రాస్తున్నారని తెలిపారు. 6 ఫ్లయింగ్ , 16 సిట్టింగ్ స్క్వాడ్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.


