కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

Mar 15 2026 5:09 AM | Updated on Mar 15 2026 5:09 AM

కడప ఎడ్యుకేషన్‌: రాయలసీమ పరిధిలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి –2026కు సంబంధించి ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి కంట్రూల్‌ రూము ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్య ఆర్‌జేడీ కాగిత శ్యాముల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాయలసీమ జోన్‌ –4 పరిధిలోని 1125 పరీక్షా కేంద్రాలలో మొత్తం 2,17,651 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. వీరిలో రెగ్యుల్‌ విద్యార్థులు 2,08,859 మందికాగా ప్రైవేటు విద్యార్థులు 8,792 మంది ఉన్నారన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రుల లేదా ప్రజలకు ఎదురయ్యే ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం సంబంధింత జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఎవౖరైనా తమ ఫిర్యాదులు లేదా సమస్యలను తెలియజేయాలనుకుంటే బాబునాయక్‌, సూపరింటెండెంట్‌(9441683500), ఎం. సురేష్‌కుమార్‌, సూపరింటెండెంట్‌(8008244717) నెంబర్లకు తెలియజేయాలని సూచించారు.

8 మంది డీటీలకు

తహసీల్దార్లుగా పదోన్నతి

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది డిప్యూటీ తహసీల్దార్లకు అడ్‌హక్‌ బేసిస్‌పై తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించి వివిధ చోట్ల పోస్టింగ్‌ ఇస్తూ శనివారం కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. వేంపల్లెలో పనిచేస్తున్న ఎ.శివలక్ష్మిని నందలూరు తహసీల్దార్‌గా నియమించా రు. కడప తెలుగుగంగ యూనిట్‌కు ఎస్‌డీసీ కార్యాలయంలో స్పెషల్‌ డీటీగా పనిచేస్తున్న పి.విజయకుమారిని చెన్నూరు తహసీల్దార్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. కలెక్టరేట్‌ కేఆర్‌ఆర్‌సీ డీటీగా పనిచేస్తున్న ఏపీ లక్ష్మినారాయణను కడప అర్బన్‌ తహసీల్దార్‌గా నియమించి, కలెక్టరేట్‌లోని ఎన్‌హెచ్‌ఏఐ విభాగానికి డిప్యూటేషన్‌పై పంపారు. వల్లూరులో పనిచేస్తున్న జె.లక్షుమ్మను సుండుపల్లె తహసీల్దార్‌గా, ముద్దనూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న వి.షఫీని మైలవరం తహసీల్దార్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. కమలాపురం డీటీ బి.అనూరాధను తర్వాత పోస్టింగ్‌ ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పే ర్కొన్నారు. కడప ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ మనోజ్‌ను బి.కోడూరు తహసీల్దార్‌గా నియమించారు. లక్కిరెడ్డిపల్లె డీటీ బి.రెడ్డెన్నను అన్నమయ్య జిల్లాలో నియమించారు.

శాస్త్రోక్తంగా

స్నపన తిరుమంజనం

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్‌లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అర్చకులు వీణా రాఘవాచార్యాలు, వీణా మనోజ్‌ కుమార్‌ లు మూల విరాట్‌కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు.

గ్యాస్‌ సిలిండర్లకు స్పాట్‌ బుకింగ్‌లకు అనుమతి లేదు

కడప సెవెన్‌రోడ్స్‌ : ఎల్‌పీజీ సిలిండర్ల స్పాట్‌ బుకింగ్‌లను అనుమతించబోమని, ఓటీపీ ఆధారంగా మా త్రమే డెలివరీ చేయా లని కడప ఆర్డీఓ భావ న ఆదేశించారు. శనివారం గ్యాస్‌ ఏజెన్సీ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె పలు సూచనలు చేశారు. ముందుగా అందజేసే విధానం (ఎఫ్‌ఐఎఫ్‌ఓ) ఆధారంగా ఎల్‌పీజీ సిలిండర్‌ డెలివరీ జరగాలన్నారు. ఎల్‌పీజీ పంపిణీ సంస్థలు తప్పనిసరిగా స్టాక్‌ బోర్డు ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే సిలిండర్‌ సరఫరా జరగాలన్నారు. విని యోగదారుల నుంచి అదనపు డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్‌ బుకింగ్‌, ఏదైనా సమస్యలు ఉంటే ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 08562–295990 అనే కంట్రోల్‌ రూముకు ఫోన్‌ చేయాలని సూచించారు. ప్రజలు ఖాళీ ఎల్‌పీజీ సిలిండర్లు ఉంటేనే రిజిష్టర్‌ మొబైల్‌ నెంబరు నుంచి బుకింగ్‌ చేసుకోవాలన్నారు.

ఐవీఆర్‌ఎస్‌ ద్వారా బుకింగ్‌

ఐఓసీఎల్‌ కోసం 7718955555, బీపీసీఎల్‌ కోసం 7715012345 లేదా 7718012345, హెచ్‌పీసీఎల్‌ కోసం 8888823456లకు ఫోన్‌ చేయాలన్నారు. మిస్డ్‌ కాల్‌ ద్వారా బుకింగ్‌ చేసుకున్న వారు ఐఓసీఎల్‌ కోసం 84549 55555, బీపీసీఎల్‌ కోసం 77109 55555, హెచ్‌పీసీఎల్‌ కోసం 94936 02222లకు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement