సంక్షేమం కోసం ‘ఐడీ’యా ! | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం కోసం ‘ఐడీ’యా !

Mar 15 2026 5:09 AM | Updated on Mar 15 2026 5:09 AM

కడప అగ్రికల్చర్‌: వ్యవసాయ భవిష్యత్తుకు భద్రతనిచ్చేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫార్మర్‌ రిజిస్ట్రీ’ ప్రక్రియ జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఆధార్‌ కార్డు తరహాలోనే రైతులకు 11 అంకెలతో కూడిన ‘యూనిక్‌ డిజిటల్‌ ఐడీ’ని ప్రభుత్వం జారీ చేస్తోంది. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలకు ఈ ఐడీనే కీలకం కానుంది.

ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే:

పథకాల అనుసంధానం: పీఎం కిసాన్‌ నిధులతో పాటు, ఎరువుల సబ్సిడీ, పంటల భీమా, మరియు రాయితీపై అందే వ్యవసాయ పనిముట్లు ఈ యూనిక్‌ నంబర్‌ ఉన్న వారికే అందుతాయి.

బ్యాంకింగ్‌ – రుణాలు:

ఈ ఐడీని కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ( ఓఇఇ)తో అనుసంధానిస్తారు. దీనివల్ల దేశంలో ఎక్కడి నుంచైనా రైతు రుణ అర్హత, బకాయిలు మరియు ప్రభుత్వ లబ్ధి వివరాలను బ్యాంకులు సులభంగా తెలుసుకోవచ్చు.

మద్దతు ధర – ఇతర సేవలు:

పండించిన పంటకు కనీస మద్దతు ధర ( క్క) పొందడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది. అలాగే నీటి పారుదల సలహాలు, తెగుళ్ల నియంత్రణ మరియు వాతావరణ సూచనలు కూడా ఈ ఐడీ ద్వారా పొందవచ్చు.

జిల్లాలో ప్రస్తుత పరిస్థితి:

కడప జిల్లాలో మొత్తం 2,56,000 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు 2,11,000 మంది ఐడీలు పొందారు. అవగాహన లేమి లేదా నిర్లక్ష్యం కారణంగా ఇంకా 45,000 మంది రైతులు రిజిస్ట్రీకి దూరంగా ఉన్నారు. నిరక్షరాస్యత వల్ల కొందరు రైతులు దీనిపై దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది.

సేద్యం చేస్తున్న రైతు

ఫార్మర్‌ రిజిస్ట్రీకి సంబంధించిన కరపత్రం

నమోదు చేసుకోకుంటే

రైతన్నకు పథకాలు కట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement