బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞా ప్రభోదకర్త శ్రీ పోతులూ రు వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రథమ శిశ్యుడు దూదేకుల సిద్దయ్య పెద్దకుమారుడు పెద్దపీరయ్యస్వామి ఆరాధ న మహోత్సవాలు ఉగాది పర్వదినాన గురువారం ఘ నంగా నిర్వహించేందుకు మఠాధిపతులు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నారు. ఉత్సవ కార్యక్రమాలు 19న ఉదయం 10 గంటలకు పూలపూజ, బి.మఠం మండలం గొడ్లవీ డు గ్రామానికి చెందిన కనపర్తి నాగిరెడ్డి, కనపర్తి సిద్దారెడ్డిల జ్ఞాపకార్థం వారికుమారులు రాత్రికి గ్రామోత్స వం ఏర్పాటు చేశారు. భక్తులు అన్నదానాలు, భజనలు,డ్రామాలు, చిన్నాయపల్లె గ్రామస్తుల ఆద్వర్యంలో సీనీ పాటకచ్చేరీ, కోలాటాలు నిర్వహించనున్నారు.
20న బండలాగుడు పోటీలు
శుక్రవారం మధ్యాహ్నం 2గంటల నుంచి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. విజేతల ఎడ్ల య జమానులకు నగదు బహుమతి అందించనున్నారు. అలాగే గుండు ఎత్తే పోటీలు నిర్వహించనున్నారు.


