ఘనంగా అన్నమాచార్యుల వర్ధంతి మహోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా అన్నమాచార్యుల వర్ధంతి మహోత్సవాలు

Mar 16 2026 7:38 AM | Updated on Mar 16 2026 7:38 AM

రాజంపేట : తాళ్లపాక అన్నమాచార్యుల 523 వర్ధంతి మహోత్సవాలు తాళ్లపాక, 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమయ్య విగ్రహానికి పాలు, పెరుగు, తేనే, పంచదార, టెంకాయ నీరు, పసుపు, గంధం, సుగంధ, పరిమళ ద్రవ్యాలతో అర్చకులు శుద్ధి చేశారు.అనంతరం హారతి , మహానివేదన చేపట్టారు. భక్తులు దర్శించుకుని తీర్ధప్రసాదాలను స్వీకరించారు.

నగరసంకీర్తన..

అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్యకు నిర్వహించిన నగరసంకీర్తనలో పాల్గొన్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం నిర్వహించారు. అన్నమయ్య ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించారు.అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద, తాళ్లపాకలోనూ సాయంత్రం 6 నుంచి రాత్రి 8గంటల వరకు సంగీతసభ, రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు హరికఽథ కార్యక్రమాలను అన్నమాచార్య ప్రాజెక్టు, స్థానిక కళాకారుతో నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement