పొలం విషయమై ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

పొలం విషయమై ఘర్షణ

Mar 14 2026 7:48 AM | Updated on Mar 14 2026 7:48 AM

– 8 మందిపై కేసు నమోదు

కొండాపురం : మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన రేనాటి బాలజి అదే గ్రామానికి చెందిన నకిలి డిఎస్పి వెంకటరమణ మధ్య పొలం విషయంపై ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో రక్తపు గాయాలు కావడంతో ఇరు వర్గాలకు చెందిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ మంజునాఽథ శుక్రవారం తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. వెంకటాపురం గ్రామానికి చెందిన రేనాటి బాలాజికి వెంకటరమణకు బురుజుపల్లె పొలంలో భూ వివాదం గతంలో ఉండేది. ఈ భూ వివాదం కోర్టులో నడుస్తుండగా రేనాటి బాలజి పొలంలో వెంకటరమణ ట్రాక్టర్‌తో దున్నటంతో మాటకుమాట పెరిగి ఘర్షణ పడ్డారు. గొడవలో రక్తపు గాయాలు కావడంతో ఇరు వర్గాలకు చెందిన 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. తాళ్లప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట జాతీయ రహదారిపై వాహనాలు ఆపి నకిలి డిఎస్పి వెంకటరమణ తన మనుషులతో ధర్నా చేయడంతో మరో కేసు నమోదు చేశామన్నారు.

కార్లు అద్దెకు తీసుకొని చీటింగ్‌

– ముగ్గురు నిందితుల అరెస్ట్‌

కడప అర్బన్‌ : కడప టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కార్లను అద్దెకు తీసుకుని ఆపై కుదవలకు పెట్టి, జల్సాలకు పాల్పడుతూ.. తమ దగ్గర కార్లు లేవని ఆపై ఓనర్లను మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను సీఐ ప్రసాద్‌ రావు, ఎస్సై రామకృష్ణ, ఏఎస్‌ఐ సుధాకర్‌ తమ సిబ్బందితో కలిసి అరెస్ట్‌ చేశారు. నిందితుల దగ్గర నుంచి రెండు కార్లు, రెండు సెల్‌ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌ అయిన వారిలో ఎరగ్రుంట్ల మండలం పెద్దనపాడు గ్రామానికి చెందిన పాలగిరి చెన్నకేశవులు, కమలాపురం మండలం ఎర్రగుడిపాడుకు చెందిన దానం సుజన్‌ కుమార్‌, పెదనపాడు గ్రామానికి చెందిన బోరెడ్డి సిద్దేశ్వరరెడ్డి ఉన్నారు.

కారు, బైక్‌ ఢీకొని ఇద్దరికి గాయాలు

లక్కిరెడ్డిపల్లి : మండలంలోని రా యచోటి–వేంపల్లి జాతీయ రహదా రి మార్గంలోని లక్కిరెడ్డిపల్లి సమీ పంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చక్రాయపేట మండలం, దేవరగుట్టపల్లికి చెందిన జగదీష్‌, ఓబయ్య అనే ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. రాయచోటి నుంచి పనులు ముగించుకొని స్వగ్రామమైన చక్రాయపేట మండలం దేవరగుట్టపల్లికు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా లక్కిరెడ్డిపల్లి సమీపంలో వేంపల్లి నుంచి రాయచోటికి వెళ్తున్న ఇన్నోవా కారు టైర్‌ పగిలి ద్విచక్రవాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని రాయచోటికి తీసుకెళ్లగా వైద్యులు తిరుపతికి రెఫర్‌ చేశారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శోభ తెలిపారు.

గాయపడిన జగదీష్‌, ఓబయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement