‘ఆమె’ చేతిలోకొస్తే ‘బంతి’గింగిరాలు పోతుంది..
ఆమె జోలికొస్తే ‘చీపురు’ తిరగబడుతుంది..
ఆమె నాడిపట్టి వైద్యం చేస్తుంది..
జననాడి పసిగట్టి ప్రజా సేవలోనూ తరిస్తుంది..
ఎంతకష్టమొచ్చినా..
ఇంటి ‘బరువు’ను బాధ్యతగా మోస్తుంది..
చంటి పాపల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది..
ఆటపాటల్లో.. చదువుసంధ్యల్లో..
‘ఆమె’ ఎప్పుడూ టాపరే..
ఆటో స్టీరింగ్ తిప్పడంలో..
మెట్రో రైలు పరుగులు పెట్టించడంలో..
బతుకుబండిని ముందుకు నడపడంలో...
‘ఆమె’ ఎప్పుడూ పైలెట్టే.. హైలెట్టే..
పల్లె గల్లీల నుంచి..
విను వీధుల దాకా..
దారి ఏదైనా..
‘ఆమె’ది నిత్యం సాహస ప్రయాణమే...
ఆమెలేని లోకం శూన్యం..
ఆమెతోనే ఈ ‘జీవ’నయానం..
ప్రపంచ పయనం..!
ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026


