సివిల్స్‌లో జయకేతనం | - | Sakshi
Sakshi News home page

సివిల్స్‌లో జయకేతనం

Mar 8 2026 7:45 AM | Updated on Mar 8 2026 7:45 AM

పులివెందులరూరల్‌: పట్టుదలే పెట్టుబడిగా, లక్ష్యమే శ్వాసగా శ్రమించి అఖిల భారత సర్వీసుల పరీక్షలో ( UPSC) సత్తా చాటింది పలమనేరు ముద్దుబిడ్డ రాయలం జయశ్రీ. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కాప్పల్లి జరావారిపల్లె గ్రామానికి చెందిన ఈమె, ప్రతిష్టాత్మక సివిల్‌ సర్వీసెస్‌ – 2025 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 360వ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటుకుంది.

సాఫ్ట్‌వేర్‌ వద్దు.. సివిల్సే ముద్దు!

జయశ్రీ పులివెందుల జేఎన్‌టీయూ ( ఒూఖ్ఖీఅ) ఇంజనీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ (CSE) విభాగంలో విద్యాభ్యాసం చేశారు. ఇంజనీరింగ్‌ పూర్తికాగానే సాఫ్ట్‌వేర్‌ రంగం వైపు వెళ్లే అవకాశం ఉన్నా, సమాజసేవ చేయాలనే ఆకాంక్షతో సివి ల్స్‌ వైపు అడుగులు వేసి.. మూడో ప్రయత్నంలో ఈ అద్భుత విజయాన్ని అందుకున్నారు.

కళాశాలలో సంబరాలు

తమ కళాశాల పూర్వ విద్యార్థిని జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడంతో జేఎన్‌టీయూలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాయలం జయశ్రీని కళాశాల ప్రిన్సిపల్‌ విష్ణువర్ధన్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ శేష మహేశ్వరమ్మ, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.

యూపీఎస్సీ ఫలితాల్లో 360వ ర్యాంకు సాధించిన జేఎన్‌టీయూ పూర్వ విద్యార్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement