● ఆరోగ్యాన్ని పండిస్తున్నారు.. | - | Sakshi
Sakshi News home page

● ఆరోగ్యాన్ని పండిస్తున్నారు..

Mar 8 2026 7:45 AM | Updated on Mar 8 2026 7:45 AM

● ఆరోగ్యాన్ని పండిస్తున్నారు..

కడప అగ్రికల్చర్‌: చదువుకున్న విజ్ఞానాన్ని మట్టికి అద్ది, తన పొలాన్నే ఒక ’జీవంత ప్రయోగశాల’గా మార్చి సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నారు పలువురు మహిళా రైతులు.

చదువుతో పాటు సాగు.. మూడు తరాలుగా వ్యవసాయం చేస్తున్న కుటుంబంలో జన్మించిన లక్ష్మిదేవి, ప్రకృతి వ్యవసాయం చేస్తూనే దూరవిద్య ద్వారా పీజీ పూర్తి చేసి మాస్టర్స్‌ పట్టా పొందారు. తన 2.5 ఎకరాల నల్లరేగడి నేలలో రసాయన సాగుకు, ప్రకృతి సాగుకు మధ్య ఉన్న భేదాన్ని ప్రయోగాత్మకంగా నిరూపిస్తున్నారు. ఏటా 30 రకాల విత్తనాలను చల్లుతూ నేలలో జీవవైవిధ్యాన్ని పెంచుతున్న ఆమె, ప్రస్తుతం 5–లేయర్‌ మోడల్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలనే ప ట్టుదలతో ముందుకు సాగుతున్నారు.

ప్రశంసల వెల్లువ.. ప్రకృతి వ్యవసాయంలో లక్ష్మీదేవి కనబరుస్తున్న ప్రతిభకు ’నాన్‌ పెస్టిసైడ్‌ మేనేజిమెంట్‌’ వారు ఆమెను ఉత్తమ ’మాస్టర్‌ ట్రైనర్‌’గా గుర్తించారు.

ప్రకృతి సాగులో ‘అనురాధ’ ఆదర్శం!

కడప అగ్రికల్చర్‌: రసాయనాలు లేని సాగుతో అటు ఆరోగ్యాన్ని, ఇటు ఆదాయాన్ని సంపాదించవచ్చని నిరూపిస్తున్నారు మరో మహిళా రైతు అనురాధ. బి.కోడూరు మండలం, ఐత్రంపేట గ్రామానికి చెందిన ఈమె సాధికార సంస్థ మార్గదర్శకత్వంలో ’ఏటీఎం’ మోడల్‌ను అనుసరిస్తూ ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్నారు.

తక్కువ ఖర్చు.. మెండుగా లాభం:

కేవలం రూ. 10 వేల పెట్టుబడితో కూరగాయల సాగు ప్రారంభించిన అనురాధ, సుమారు రూ. 35 వేల వరకు ఆదాయాన్ని గడిస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ప్రకృతి సాగుతో

’ఏటీఎం’

వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు ప్రొద్దుటూరు మండలం నక్కలదిన్నెకు చెందిన రైతు కానాల మాధవి. తనకున్న 1.50 ఎకరాల పొలాన్ని ఒక ’ఏటీఎం’ (Any Time Money) మోడల్‌గా మార్చి, ఏడాది పొడవునా ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పండించిన కూరగాయలను నక్కలదిన్నె, కామనూరు గ్రామాల్లో విక్రయించడమే కాకుండా, ప్రొద్దుటూరు పట్టణంలోని సుమారు 10 కుటుంబాలకు నేరుగా ఇంటికే సరఫరా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement