కడప ఎడ్యుకేషన్: విశ్వవిద్యాలయ చదువులు ముగించుకొని విశ్వవిద్యాలయంలోనే పట్టా పుచ్చుకోవడం విద్యార్థుల కల అని.. ఆ కలను దూరం చేస్తూ స్నాతకోత్సవాన్ని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించటం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా వెంకటయ్య పేర్కొన్నారు. ఈ నెల 13న అలంఖాన్ పల్లె బైపాస్ రోడ్డులో ఉన్న డీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో యోగి వేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జరగబోతున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు ప్రకటించారని పేర్కొన్నారు. ఒక విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం విశ్వవిద్యాలయంలో కాకుండా ఫంక్షన్ హాల్లో జరపడమేమిటని వెంకటయ్య ప్రశ్నించారు. ఇంతవరకు యూనివర్సిటీలో ఒక పెద్ద ఆడిటోరియం లేకపోవడం విచారించదగ్గ విషయమన్నారు.


