కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పిల్లలకు తోడుగా వచ్చిన తల్లిదండ్రులు ఆల్ ది బెస్ట్ చెప్పి పరీక్షా కేంద్రాలలోకి పంపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అములులో పెట్టారు. దీంతోపాటు పరీక్ష విధులకు హాజరైన చీఫ్ సూపరెండెంటెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు, పరీక్షల ఇన్విజిలేటర్స్‌తోపాటు సిబ్బంది ఎవరికి కూడా సెల్‌ఫోన్‌ను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. అన్ని పరీక్షా కేంద్రాలలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.
జిల్లాలో 161 కేంద్రాలలో...
జిల్లావ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలకు సంబంధించి 167 పరీక్షా కేంద్రాలలో 27,766 మంది విద్యార్థులకుగాను 27,600 మంది హాజరుకాగా 166 మంది గైర్హాజరయ్యారు. పది పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 7 బృందాలు ప్‌లైయింగ్ స్క్వాడ్ జిల్లాలోని 42 పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేశారు. మరో 47 పరీక్షా కేంద్రాలలో సిట్టింగ్‌ను ఏర్పాటు చేశారు.
ఓపెన్ స్కూల్‌కు సంబంధించి...
జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి 31 పరీక్షా కేంద్రాలలో 2333 మంది అభ్యాసకులకుగాను 1944 మంది హాజరుకాగా 389 మంది గైర్హాజరయారు. పది ఓపెన్ పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 6 బృందాలు ప్‌లైయింగ్ స్క్వాడ్ 31 పరీక్షా కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారు.
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా అబ్జర్వర్
జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల రాష్ట్ర డైరెక్టర్ మధుసూధన్‌రావు జిల్లాలోని ఏడు పరీక్షా కేంద్రాలను తనీఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షా కేంద్రాలలోని చీఫ్ సూపరింటెండెంట్లకు, డిపార్టుమెంట్ ఆఫీసర్లకు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. ఎక్కడా ఎలాంటి ఆరోఫణలకు తావులేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
ఎలాంటి ఆరోపణలకు
తావు లేకుండా....డీఈఓ
జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ కడపలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్, సెంట్రల్ జెయిల్ ఉర్దూ పాఠశాల, జయనగర్ బాలికల హైస్కూల్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కడప గాంధీ నగర్ మున్సిపల్ హైస్కూల్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 167 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు పది పరీక్షలను రాస్తున్నారన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమై అన్ని రకాల మౌలిక వసతులను కల్పించామన్నారు. ఎక్కడ కూడా పిల్లలకు నేలబారు పరీక్షలకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లను సిద్దం చేశామన్నారు. ఎండా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని పరీక్షా కేంద్రాలలో మంచినీటి సౌకర్యంతోపాటు ఓఆర్‌ఎస్, మెడికల్ కిట్టులను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా మాల్‌ప్రాక్టీస్ జరిగినట్లు తమ దృష్టికి వస్తే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
పలు పరీక్షా కేంద్రాలను....
జిల్లాలోని 7 పరీక్షా కేంద్రాలను పది పరీక్షల జిల్లా అబ్జర్వర్ మధుసూధన్‌రావు పరిశీలించగా డీఈఓ షంషుద్దీన్ కడపలోని మూడు పరీక్షా కేంద్రాలను, 7 ప్‌లైయింగ్ స్వ్కాడ్ బృందాలు 42 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.
కడపలోని గాంధీనగర్ స్కూల్ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు
పరీక్షకు హాజరైన విద్యార్థులు
27,766 మందికిగాను 27,600 మంది హాజరు
జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అబ్జర్వర్, డీఈఓలు
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద144 సెక్షన్ అమలు


