ఎంఈఓ, హెచ్‌ఎంలకు జిల్లాస్థాయి వర్క్‌షాపు | - | Sakshi
Sakshi News home page

ఎంఈఓ, హెచ్‌ఎంలకు జిల్లాస్థాయి వర్క్‌షాపు

Mar 12 2026 7:33 AM | Updated on Mar 12 2026 7:33 AM

ప్రారంభించిన డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌

కడప ఎడ్యుకేషన్‌: ఎంఈఓలు, క్లస్టర్‌ హెచ్‌ఎంలకు, ఎస్‌జీటీ టీచర్లు, స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజ్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ నాన్‌ లాంగ్వేజ్‌ టీచర్లకు రెండు రోజుల వర్కుషాపును బుధవారం కడప సీఎస్‌ఐ కాంపౌండ్‌లోని డీసీఈబీ హాల్‌లో నిర్వహించారు.పరాక్‌ రాష్ట్రీయ సర్వేక్షన్‌, ఎన్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన తొలి రోజు శిక్షణ కార్యక్రమాన్ని డీసీఈబీ సెక్రటరీ, కోర్సు కో–ఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు, గణితం కాంపిటెన్సీలలో 3, 6 , 9 తరగతులకు అసెస్మెంట్‌ ఎలా చేయాలి, విద్యార్థులలో కాంపిటెన్సీలను డెవలప్‌ చేయడానికి ఏ రకమైన విధానాలను అవలంబించాలను విషయాలను తెలియచేశారు. రిసోర్స్‌ పర్సన్స్‌ జయన్న , చంద్రఓబుల రెడ్డి , సురేష్‌ వర్కుషాపులో పలు అంశాలను వివరించారు. ఈ వర్క్‌ షాప్‌ లో జిల్లాకు సంబంధించిన 36 మండలాల నుంచి ప్రతి మండలం నుంచి ఎంఈఓ1 – 2 లు , ఇద్దరు క్లస్టర్‌ హెడ్‌ మాస్టర్లు, ఇద్దరు సెకండియర్‌ టీచర్లు, ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజ్‌, ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ నాన్‌ లాంగ్వేజ్‌ అందరూ కలిసి మొత్తంగా ఎనిమిది మంది చొప్పున తొలిరోజు శిక్షణకు 285 మంది హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement