వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం మొదలుకొని ప్రతి కార్యక్రమం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడి సమాధి ఘాట్ వద్ద నుంచే ప్రారంభిస్తూ వచ్చారు. పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం తలపెట్టినా ఇడుపులపాయ నుంచే మొదలు పెట్టేవారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచే పాదయాత్ర మొదలుపెట్టారు. అభ్యర్థుల ప్రకటనలు....నామినేషన్ పత్రాలు...మొదటి ప్లీనరీ ....ఇలా ఎలాంటి కార్యక్రమం తలపెట్టినా వైఎస్సార్ ఘాట్ వద్దకు వచ్చి ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే ముందుకు కదిలేవారు.


