సంక్షేమ ముద్ర...
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటితో సరిగ్గా పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. పార్టీ ఆవిర్భవించిన క్షణం నుంచి .. ఇప్పటివరకు అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజానేతగా కీర్తి గడించారు. పార్టీని నడపడంలో తిరుగులేని నాయకుడిగా నిలిచారు.
చరిత్ర సృష్టించిన ఉప ఎన్నికలు
కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ ధోరణికి విసిగిపోయిన వైఎస్ జగన్ కడప పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే అప్పటి పులివెందుల ఎమ్మెల్యే పదవికి వైఎస్ విజయమ్మ కూడా రాజీనామా చేసి బయటికి వచ్చారు. ఆ తర్వాత చోటుచేసుకున్న ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. కడప ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఢిల్లీ పీఠం వణికిపోయేలా తీర్పు కట్టబెట్టారు. జిల్లాలోనే వైఎస్ జగన్‌మోహన్‌రె డ్డిని కట్టడి చేయా లని కాంగ్రెస్, టీడీపీ పెద్దలు ఏకమయ్యా రు. రాష్ట్రంలోని నాయకులంతా వచ్చి పులివెందుల, కడపలో వాలిపోయారు. మంత్రులు తిష్టవేసి కుట్రలు చేస్తున్నా, ఏమాత్రం బెదరకుండా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కడై పోరాడారు. కడప ఎంపీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 5,45,678 ఓట్లు మెజార్టీతో అఖండ విజయం సాధించారు. మా చరిత్ర గొప్పదంటూ జబ్బలు చరుచుకుంటూ వచ్చిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్టు గల్లంతయ్యేలా చేసి దేశ ఎన్నికల చరిత్రలో రికార్డు సృష్టించారు.
బాధ్యతగా నిత్యం
ప్రజల్లోనే...
2011 నుంచి ఇప్పటివరకు ప్రజానేతగా, ప్రతిపక్ష నేతగా, ప్రజల ముఖ్యమంత్రిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా అనునిత్యం ప్రజల మధ్యనే గడుపుతున్నారు. హోదా ఏదైనా ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ వారి మధ్యనే ఉంటూ ప్రజా హృదయనేతగా గుర్తింపు పొందారు. పాలకుల ప్రజా వ్యతిరేక విదానాలపై ఎప్పటికప్పుడు ప్రజా క్షేత్రంలో పోరాటాలు చేస్తూనే ముందుకు కదిలారు. ప్రజా సంకల్పం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వచ్చారు. కుటుంబానికి కంటే ప్రజలకే ఎక్కువ సమయం కేటాయించారు. ఈ క్రమంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలు సాధించి రికార్డు సృష్టించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను కంటిరెప్పలా కాపాడుకున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పరితపించారు. నేరుగా ప్రజలకు లబ్ధిచేకూరేలా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టడంతో పాటు విజయవంతంగా అమలు చేశారు.
2011 మార్చి 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం
ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ
అనునిత్యం ప్రజల్లో ఉంటూ జననేతగాఎదిగిన పార్టీ అధినేత వైఎస్ జగన్
రాష్ట్ర ప్రజల గుండెల్లో 2019–24 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాం చరిత్రలో లిఖింపదగ్గ అధ్యాయంగా గుర్తింపు పొందింది. పేద ప్రజల అభ్యున్నతే ఏకై క లక్ష్యంగా కృషి చేశారు. ప్రతి పథకం మహిళాభ్యుదయం కోసం పథక రచన చేశారు. రైతు భరోసా, ఉచిత పంటల బీమా, అమ్మ ఒడి, ఆసరా, నాడు–నేడు, చేదోడు–వాదోడు, గ్రామ సచివాలయం వ్యవస్థ ఇలా అన్ని రకాలుగా ప్రజలకు చేరువయ్యారు. ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను ప్రత్యేకంగా నడిపిస్తూ దేశంలోనే రాష్ట్రానికి ప్రత్యేకస్థానం కల్పించడంలో సఫలీకృతులయ్యారు. రాజకీయాలు, వర్గాలు, ప్రాంతాలకతీతంగా సంక్షేమ ఫలాలు అందించారు. ప్రతి కుటుంబంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రేమాభిమానాలు దక్కించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి సరిగ్గా 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగు పెడుతోంది.


